Swetha
ఒకప్పుడు పూరి జగన్నాథ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండేది. కానీ ఈ మధ్యన ఈ దర్శకుడి నుంచి సరైన సినిమాలు వస్తున్నట్లు ఎక్కడ కనిపించడం లేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫార్మ్ లోకి వచ్చిన పూరి జగన్నాధ్.. లైగర్ , డబుల్ ఇస్మార్ట్ తో డీలా పడాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత ఇప్పటివరకు పూరి సైలెంట్ గానే ఉన్నాడు.

ఒకప్పుడు పూరి జగన్నాథ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండేది. కానీ ఈ మధ్యన ఈ దర్శకుడి నుంచి సరైన సినిమాలు వస్తున్నట్లు ఎక్కడ కనిపించడం లేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫార్మ్ లోకి వచ్చిన పూరి జగన్నాధ్.. లైగర్ , డబుల్ ఇస్మార్ట్ తో డీలా పడాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత ఇప్పటివరకు పూరి సైలెంట్ గానే ఉన్నాడు. ఇక ఇప్పుడు గట్టిగ కంబ్యాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు పూరి జగన్నాధ్. తన స్టైల్ అఫ్ మేకింగ్ ను బయటకు తీస్తున్నారు పూరి. ఈ క్రమంలో విజయ్ సేతుపతితో ఓ సినిమాను స్టార్ట్ చేశారు.
ఈ కాంబినేషన్ ఏ చాలా కొత్తగా ఉంది. ఒకవేళ సినిమా వర్కౌట్ అయితే కనుక ఓ కొత్త కాన్సెప్ట్ రావడం ఖాయం. పైగా స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని దానికోసం పూరి స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడని ఇన్సైడ్ టాక్. దీనికి సంబందించిన షూటింగ్ కూడా మొదలుపెట్టారట. ఈ సినిమా కోసం బెగ్గర్’, ‘భవతీ భిక్షాందేహీ’ అనే టైటిల్స్ ను కన్సిడర్ చేస్తున్నట్లు టాక్. ఇక ఈ సినిమా కాకుండా మరో రెండు కథలను కూడా లాక్ చేసుకున్నాడట పూరి.
దానిలో ఓ సినిమాలో ఓ తమిళ స్టార్ హీరో నటించబోతున్నట్లు తెలుస్తుంది. శివకార్తికేయన్ , సూర్య ఈ ఇద్దరిలో ఒకరు హీరోగా ఉండొచ్చని అంటున్నారు. ఇక మరో కథ తెలుగులో ఓ యంగ్ హీరో కి వినిపించబోతున్నట్లు తెలుస్తుంది. సో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో పూరి జగన్నాథ్ మళ్ళీ ఫార్మ్ లోకి వస్తున్నట్లు తెలుస్తుంది. ముందు ముందు పూరి నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.