iDreamPost
android-app
ios-app

కూలీ అందుకోవాల్సిన టార్గెట్ ఇంకా ఉంది..

  • Published Aug 25, 2025 | 4:29 PM Updated Updated Aug 25, 2025 | 4:29 PM

భారీ అంచనాల మధ్యన కూలీ సినిమా రిలీజ్ అయింది. కానీ మొదటి రోజు థియేటర్స్ కు వెళ్లిన ఆడియన్స్ కు మాత్రం సినిమా కంప్లీట్ గా శాటిస్ఫై చేయలేకపోయింది. కానీ స్లో స్లో గా టాక్ మారిపోయింది. అనుకున్నంత కాకపోయినా సినిమా డీసెంట్ టాక్ నే సంపాదించుకుంది.

భారీ అంచనాల మధ్యన కూలీ సినిమా రిలీజ్ అయింది. కానీ మొదటి రోజు థియేటర్స్ కు వెళ్లిన ఆడియన్స్ కు మాత్రం సినిమా కంప్లీట్ గా శాటిస్ఫై చేయలేకపోయింది. కానీ స్లో స్లో గా టాక్ మారిపోయింది. అనుకున్నంత కాకపోయినా సినిమా డీసెంట్ టాక్ నే సంపాదించుకుంది.

  • Published Aug 25, 2025 | 4:29 PMUpdated Aug 25, 2025 | 4:29 PM
కూలీ అందుకోవాల్సిన  టార్గెట్ ఇంకా ఉంది..

భారీ అంచనాల మధ్యన కూలీ సినిమా రిలీజ్ అయింది. కానీ మొదటి రోజు థియేటర్స్ కు వెళ్లిన ఆడియన్స్ కు మాత్రం సినిమా కంప్లీట్ గా శాటిస్ఫై చేయలేకపోయింది. కానీ స్లో స్లో గా టాక్ మారిపోయింది. అనుకున్నంత కాకపోయినా సినిమా డీసెంట్ టాక్ నే సంపాదించుకుంది. ఇక మొన్న వీకెండ్ ని మాత్రం కూలీ బాగానే వాడుకుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు కూలీ మూవీ ఓవరాల్ గా 470 కోట్ల గ్రాస్ ను దాటేసిందట. కానీ కూలీ పెట్టుకున్న బ్రేక్ ఈవెన్ టార్గెట్ మాత్రం 600 కోట్లు టచ్ చేయడం. అది కాస్త కష్టమయ్యేలానే ఉంది. ఒకవేళ ఈ మార్క్ కనుక అందుకోకపోతే తమిళ్ లో కూడా సినిమా ప్లాప్ అనిపించుకోక తప్పదు.

ప్రస్తుతం ఈ వారం కూడా కూలీకి ఓపెన్ గ్రౌండ్ దక్కినట్టే. ఎందుకంటే శివకార్తికేయన్ మదరాసి మూవీ రాడానికి ఇంకా పది రోజుల సమయం ఉంది. కూలీ ఏమైనా రాబట్టాలంటే ఈలోపే రాబట్టాల్సి ఉంటుంది. సో దానికోసం మరోసారి లోకేష్ కనగరాజ్ తమిళ్ లో ప్రమోషన్స్ చేసే ఆలోచనలో ఉన్నారట . ఒకవేళ ఇది వర్కౌట్ అయితే బహుశా మళ్ళీ పికప్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారేమో . అయితే ఇది అనుకున్నంత సులువు కాదు. ఇప్పటికే సినిమాను చాలా మంది చూడడం రివ్యూలు ఇచ్చేయడం లాంటివి జరిగిపోయాయి. ఒక్కసారి వచ్చిన టాక్ ను మరోసారి మార్చాలంటే.. ఏదైనా బలమైన మ్యాజిక్ జరగాల్సిందే.

తెలుగు, తమిళం ఇలా ఏ భాషలోనూ కూడా కూలీ లాభాల్లోకి అడుగుపెట్టింది లేదు. జరిగిన బిజినెస్ కు తగినట్టు వసూళ్లు రాబట్టలేకపోయింది. కాకపోతే ఈ సినిమా వార్ 2 తో పాటు రిలీజ్ అయింది కాబట్టి.. ఆ సినిమా మీద ఈ సినిమా కాస్త మెరుగు అనే టాక్ సంపాదించుకుంది. రిలీజ్ తర్వాత మూవీ టీం కూడా పెద్దగా ఇంటర్వూస్ ఇచ్చింది కూడా లేదు. దాని వెనుక జరిగిన కథేంటో వాళ్ళకే తెలియాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.