మున్సిపల్ ఎన్నికలకు సరిగ్గా రెండు రోజుల సమయం ఉన్న ఈ సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలు నిలిపివేయాలంటూ సోమవారం రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సోమవారం ప్రచారం ముగింపు సమయానికి ఎన్నికలు పూర్తిగా వాయిదా పడినట్లు తెలిసింది. దింతో అభ్యర్థులు గోళ్లుమంటున్నారు. ఓటర్ల లిస్టు లో తేడాలు 2019లో ఏలూరు నగరపాలక సంస్థ లో ఏడు పంచాయతీలను విలీనం చేశారు. సత్రంపాడు, శనివారపుపేట, తంగేళ్లమూడి, కొమడవోలు, వెంకటాపురం, చోదిమెల్ల, […]