iDreamPost
android-app
ios-app

ఓటరు జాబితాలో మీ పేరు లేదా.. ఇలా నమోదు చేసుకోండి..?

  • Published Oct 27, 2023 | 1:08 PM Updated Updated Oct 27, 2023 | 1:08 PM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. ఈసారి ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. ఈసారి ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు.

ఓటరు జాబితాలో మీ పేరు లేదా.. ఇలా నమోదు చేసుకోండి..?

దేశంలో ఐదు రాష్ట్రాలకు ఇటీవల ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. తెలంగాణలో నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్, నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న కౌంటింగ్ ఉండనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. తెలంగాణలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని.. ఇంకా తమ పేర్లు ఓట్ల లీస్టులో నమోదు కాకపోతే.. కొత్తగా ఓటు హక్కు కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులు సూచించారు. అక్టోబర్ 31 వరకు ఈ అవకాశం ఉందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది ప్రతి భారతీయుడి ప్రథమ కర్తవ్యం. ఓటు హక్కుతో ఐదేళ్ల పాటు మనల్ని పాలించే నేతలను మనమే ఎన్నుకునే ఓ గొప్ప అవకాశం. సమాజం పట్ల అవగాహన ఉండి.. సమాజం కోసం పాటుపడే నేతల్ని ఎన్నుకొని మరీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. ఈ క్రమంలోనే 18 ఏళ్ల నిండిన యువత ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులు కోరుతున్నారు. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగబోతున్నాయి. కొత్తగా ఓటు హక్కు కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని.. ఇందుకు అక్టోబర్ 31 వరకు ఛాన్సు ఉందని ఈసీ అధికారులు తెలిపారు. ఇందుకోసం తమ ఏరియాకి చెందిన బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర మాన్యువల్ గా నమోదు చేసుకునే అవకాశం ఉంది. లేదా ఆన్ లైన్ https://voters.eci.gov.in రిజిస్ట్రేషన్ చేయించుకోవొచ్చు. లేదా ఓటర్ హెల్ప్ లైన్ ద్వారా కూడా నమోదు చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

కొత్త ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోవడానికి వ్యక్తిగత సమాచారం.. మొబైల్ నంబర్, ఫోటో, వయసు నిర్ధారణకు సంబంధించిన పాన్ లేదా ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్, గ్యాస్ కార్డు లేదా కరెంటు బిల్లు జిరాక్సులు ఇవ్వాల్సి ఉంటుంది. ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. అక్టోబర్ 31 తర్వాత 10 రోజుల్లో ఓటర్ల పరిశీలన ఉంటుంది.. అన్నీ కరెక్ట్ గా ఉంటే ఓటర్ ఐడీ ఇస్తారు. ఓటరు నమోదు చేసే సమయంలో ఏదైనా తప్పు ఉంటే.. వారికి ఓటరు ఐడీ లభించదు. ఇక ఓటర్ల లీస్టులో నవంబర్ 10 వరకు ఉందో లేదో తెలిసిపోతుంది. ఆయా నియోజకవర్గాల వారీగా పేర్లు నమోదు అయి ఉంటే.. నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం ఉంటుంది.