iDreamPost
android-app
ios-app

ఓటర్స్‌ లిస్ట్‌లో మీ పేరు ఉందా? లేదా? చెక్‌ చేసుకోండిలా..

ఓటర్స్‌ లిస్ట్‌లో మీ పేరు ఉందా? లేదా? చెక్‌ చేసుకోండిలా..

మరి కొన్ని నెలల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అధికార పార్టీలు ఎంతో వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఇక, ప్రతిపక్ష పార్టీలు కూడా తమదైన వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. అన్ని పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలోని దాదాపు 4 కోట్ల మంది ఓటర్లు.. తెలంగాణలోని దాదాపు మూడు కోట్ల మంది ఓటర్లు ఆయా పార్టీల భవితవ్యాలను నిర్దేశించనున్నారు.

అయితే, ఓటింగ్‌ సమయం దగ్గర పడేకొద్దీ ఓటర్ల విషయంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఓటర్ల లిస్టులో పేరు లేకపోవటం.. ఉన్నా వివరాలు, ఇతర విషయాల్లో తప్పులు ఉండటం జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు ఓటర్‌ ఐడీ గురించిన వివరాలు తెలుసుకోవాలంటే చాలా ప్రయాస పడాల్సి వచ్చేది. కానీ, టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత క్షణాల్లో అన్ని వివరాలు తెలుసుకోగలుగుతున్నాం. మీరు, మీ ఓటర్‌ ఐడీ వివరాలను కూడా ఆన్‌లైన్‌లో ఇట్టే తెలుసుకోవచ్చు. అసలు ఓటర్‌ లిస్టులో మీ పేరు ఉందా? లేదా? కనుక్కోవచ్చు..

ఆన్‌లైన్‌లో ఓటరు జాబితాలోని మీ పేరు, ఇతర వివరాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..

  • మొదటగా https://electoralsearch.eci.gov.in/లోకి వెళ్లాలి.
  • అక్కడ Search in Electoral Roll అనే ఆప్చన్‌ ఉంటుంది.
  • దాని కింద Search by Details, Search by EPIC, Search by Mobile అన్న మరో మూడు ఆప్చన్లు ఉంటాయి.
  • మీ దగ్గర అందుబాటులో ఉన్న వివరాలను బట్టి ఆ మూడింటిలో ఓ దానిపై క్లిక్‌ చేయాలి. ప్రతీ ఆప్చన్‌లో మనకు నచ్చిన బాషను ఎంచుకోవచ్చు.
  • Search by Detailsను క్లిక్‌ చేసినట్లు అయితే.. అందులో అడిగిన అన్ని వివరాలను అందించాలి. తర్వాత కాప్చా ఫిల్‌ చేసి సెర్చ్‌ చేస్తే మీ ఓటర్‌ ఐడీ వివరాలే వస్తాయి.
  • Search by EPICను క్లిక్‌ చేసినట్లు అయితే.. అందులోని ఈపీఐసీ నెంబర్‌, స్టేట్‌, కాప్చాలను ఫిల్‌ చేసి సెర్చ్‌ చేస్తే సరిపోతుంది.
  • Search by Mobileను క్లిక్‌ చేసినట్లు అయితే.. అందులో మొబైల్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసి, ఓటీపీ ద్వారా ఓటర్‌ ఐడీ వివరాలను పొందొచ్చు.
  • ఒక వేల ఓటర్‌ లిస్టులో మీ పేరు లేకపోతే.. www.nvsp.in లోకి లాగిన్‌ అయి కొత్తగా అప్లై చేసుకోవచ్చు..