మాస్ మహారాజా రవితేజ అభిమానులకు విక్రమార్కుడు అంటే ప్రత్యేకమైన అభిమానం. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ అయినా దాన్ని తీర్చిదిద్దిన తీరు, రవితేజ ఎనర్జీని డ్యూయల్ రోల్స్ లో పూర్తిగా వాడుకున్న విధానం దాన్ని బ్లాక్ బస్టర్ చేశాయి. అందుకే టీవీలో వచ్చినప్పుడంతా ఈ సినిమాకు మంచి రేటింగ్స్ వస్తుంటాయి హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో రీమేక్ చేస్తే అక్కడా ఘనవిజయం సాధించింది. ఇటీవలి కాలంలో దీని సీక్వెల్ కు సంబంధించిన వార్తలు గట్టిగానే […]
సాధారణంగా డ్యూయల్ రోల్ సినిమాల్లో హీరో వేసిన పాత్రల మధ్య రక్త సంబంధం ఉంటుంది. అలనాటి రాముడు భీముడుతో మొదలుపెట్టి జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ దాకా చూసుకుంటే ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. నాగార్జున హలో బ్రదర్ చూసినా బాలకృష్ణ అపూర్వ సహోదరులు చూసుకున్నా ఇదే తీరు. అయితే మినహాయింపులుగా నిలిచినవి లేకపోలేదు. కమల్ హాసన్ ఇంద్రుడు చంద్రుడు, చిరంజీవి రౌడీ అల్లుడు కొన్ని ఉదాహరణలు. అధిక శాతం మాత్రం బ్లడ్ రిలేషన్ కాన్సెప్ట్ తో రూపొందినవే. […]
ప్రతి రెండుమూడేళ్లకు ప్రేక్షకుల అభిరుచులు డిమాండ్లు మారిపోతున్న ప్రస్తుత తరుణంలో ఒక హీరోయిన్ దశాబ్దంన్నర పాటు పరిశ్రమలో టాప్ ప్లేస్ లో కొనసాగడం చిన్న విషయం కాదు. అందులోనూ హీరోలకు ధీటుగా తనకంటూ సోలో మార్కెట్ ని సృష్టించుకోవడం అందరి వల్లా సాధ్యమయ్యేది కాదు. సూపర్ తో అనుష్కను పరిచయం చేసినప్పుడు నాగార్జున కానీ పూరి జగన్నాధ్ కానీ తను ఇంత స్థాయికి చేరుకుంటుందని ఊహించారో లేదో కానీ స్వీటీ అని అభిమానులు ముద్దుగా పిలిచే అనుష్క […]