iDreamPost
android-app
ios-app

Pic Talk: విక్రమార్కుడు చైల్డ్ ఆర్టిస్ట్.. అప్పుడే ఇంతలా మారిపోయిందేంటి!

  • Published Mar 27, 2024 | 8:41 PM Updated Updated Mar 27, 2024 | 8:41 PM

చిన్నతనంలో ఎన్నో సినిమాలలో .. స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ లంతా .. ఓ సమయం వచ్చేసరికి కనుమరుగైపోతూ ఉంటారు. మరి, ఈ క్రమంలో విక్రమార్కుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూద్దామా.

చిన్నతనంలో ఎన్నో సినిమాలలో .. స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ లంతా .. ఓ సమయం వచ్చేసరికి కనుమరుగైపోతూ ఉంటారు. మరి, ఈ క్రమంలో విక్రమార్కుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూద్దామా.

  • Published Mar 27, 2024 | 8:41 PMUpdated Mar 27, 2024 | 8:41 PM
Pic Talk: విక్రమార్కుడు చైల్డ్ ఆర్టిస్ట్.. అప్పుడే ఇంతలా మారిపోయిందేంటి!

ఈ మధ్య కాలంలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించిన ఆ చిన్నారుల ప్రెసెంట్ ఫొటోస్ .. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనితో వారికి క్రేజ్ కూడా బాగానే పెరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఓ చిన్నారి ఫోటో కూడా ఇలానే వైరల్ అవుతూ ఉంది. కారణాలు ఏమై ఉంటాయో తెలియదు కానీ.. చైల్డ్ ఆర్టిస్ట్ లు గా వెండి తెరపై ఎంట్రీ ఇచ్చిన ఎంతో మంది .. నటి నటులు ఉన్నట్లుండి సినిమాలకు దూరం అయిపోతుంటారు . ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిన్నది కూడా ఈ కోవకు చెందినదే. రవి తేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన సినిమా విక్రమార్కుడు. మరి, ఈ సినిమాలో రవి తేజకు కూతురిగా నటించిన ఆ చిన్నారి గుర్తుందా ! .. రవి తేజను నాన్న అని పిలుస్తూ క్యూట్ గా నటించిన ఈ చిన్నారి .. పలు చిత్రాలలో నటించిన తర్వాత మరే చిత్రాలలోనూ కనిపించలేదు. మరి, ఈ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో .. ఏం చేస్తుందో చూసేద్దాం.

మాస్ మహారాజ రవి తేజ కెరీర్ లో ఎప్పటికి బెస్ట్ మూవీగా నిలిచిపోయే సినిమా.. విక్రమార్కుడు. ఈ సినిమాలో రవి తేజ డబుల్ రోల్ లో దర్శనం ఇచ్చి. ఓ వైపు దొంగగా మరో వైపు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి.. ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ వడ్డించేశారు. రవి తేజ కెరీర్ లోనే “విక్రమార్కుడు” సినిమా ఓ మంచి సూపర్ హిట్ గా నిలిచిపోయింది. అయితే, ఈ సినిమాలో రవి తేజ కూతురిగా.. అమాయకపు ముద్దు మాటలతో రవి తేజను నాన్న అని పిలిచిన పాప గుర్తుందా ! ఆ చిన్నారి విక్రమార్కుడు తర్వాత అనేక సినిమాల్లో నటించి.. కొన్నాళ్ల తర్వాత ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. దీనితో నెటిజన్లు ఈ చిన్నారి గురించి ఆరా తీయడం ప్రారంభించారు. ఈ చిన్నారి ఇప్పుడేం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ చిన్నారి పేరు “నేహా”.

నేహా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. పై చదువులపై దృష్టి పెట్టడం కోసం సినిమాలకు దూరం అయిందట. ఈ చిన్నారి విక్రమార్కుడు సినిమాతో పాటు.. అనసూయ, రాముడు, ఆది విష్ణు, రక్ష, సర్కార్ సినిమాలలో కూడా కనిపించింది. దీనితో ఆమె ఇండస్ట్రీలో మంచి పేరే సంపాదించుకుంది. ఈ చిన్నారి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆమె అమెరికాలోని ఫ్లోరిడాలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు మాత్రం హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీలో పలు చిత్రాలలో నటించిన తర్వాత.. ఆమె తన కెరీర్ లో దృష్టి పెట్టె క్రమంలో సినిమాలకు దూరం అయింది. ఇక తాజాగా నేహా తన ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ చిన్నారి ప్రెసెంట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి, ఈ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet