ఆత్మగౌరవం, ఆత్మాభిమానం కోసం పోరాటం చేస్తాన్న మజీ మంత్రి ఈటల రాజేందర్కు తొలి విజయం దక్కింది. తన భార్య జమున పేరున ఉన్న జమున హేచరీస్పై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై ఈటలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కబ్జా ఆరోపణలను నిర్థారిస్తూ మెదక్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రాథమిక నివేదికను పరిగణలోకి తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు ఇచ్చి సరైన విధానంలో సర్వే చేయాలని స్పష్టం చేసింది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం […]
ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తనను తప్పించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసు నుంచి తనను తప్పించాలని అంతకు ముందు ఏసీబీ ప్రత్యేక కోర్టులో కూడా సండ్ర పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. ఏసీబీ తీర్పును సవాల్ చేస్తూ సండ్ర తాజాగా తెలంగాణ హైకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేశారు. […]
రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత సుజనా చౌదరికి ఢిల్లీ ఎయిర్పోర్టులో చెదు అనుభవం ఎదురైంది. అమెరికా వెళ్లేందుకు సిద్ధమైన సుజనా చౌదరిని ఎయిర్పోర్టు అధికారులు అడ్డుకున్నారు. బ్యాంకులను మోసం చేసిన కేసులో ఆయనపై లుక్ అవుట్ నోటీసులు ఉన్న నేపథ్యంలో అమెరికా వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్పోర్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతించలేదు. సుజనాను ఎయిర్ పోర్టు నుంచి వెనక్కి పంపేశారు. దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు చేయవద్దని సుజనాకు సూచించారు. […]
అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు నగదు చెల్లించాలని గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. 20 వేల రూపాయల లోపు డిపాజిటర్లకు నగదు చెల్లించేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. రాబోవు మార్చి నెలాఖరు లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో అగ్రిగోల్ట్ సంస్థ వివాదంలో చిక్కుకుంది. నిర్వాహకులు జైలుకెళ్లారు. లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు అగ్రిగోల్ట్ సంస్థ డిపాజిటర్లకు చెల్లించాల్సి ఉంది. వందలాది […]
తెలంగాణ పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి, అధికార టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కెటిఆర్) ఎన్జీటీ జారీ చేసిన ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఎన్జీటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మంత్రి కెటిఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్జీటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని కెటిఆర్ అన్నారు. తనపై రాజకీయ కక్షపూరిత పిటిషన్ వేశారని, రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ఫాంహౌజ్ తనది కాదని స్పష్టం చేసి హైకోర్టుకు కెటిఆర్ నివేదించారు. నిజా […]