iDreamPost
android-app
ios-app

Jr NTR: హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే

  • Published May 17, 2024 | 9:56 AM Updated Updated May 17, 2024 | 2:32 PM

జూనియర్ ఎన్టీఆర్ తాజాగా హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. ఇంతకు వివాదం ఏంటంటే

జూనియర్ ఎన్టీఆర్ తాజాగా హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. ఇంతకు వివాదం ఏంటంటే

  • Published May 17, 2024 | 9:56 AMUpdated May 17, 2024 | 2:32 PM
Jr NTR: హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే

ఈమధ్య కాలంలో కోర్టులు, పోలీసులను ఆశ్రయిస్తున్న సెలబ్రిటీల సంఖ్య బాగా పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో వారే వివాదాల్లో చిక్కుకుంటుండగా.. మరి కొన్ని సందర్భాల్లో.. సెలబ్రిటీలే సమస్యలు ఎదుర్కొంటూ.. వాటి పరిష్కారం కోసం కోర్టలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సైతం హైకోర్టను ఆశ్రయించడం సంచలనంగా మారింది. ఇంతకు వివాదం ఏంటి.. ఎందుకు తారక్ కోర్టను ఆశ్రయించాడు వంటి వివరాలు తెలియాలంటే.. ఇది చదవండి. ఆ తర్వాత మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంతకు వివాదం ఏంటంటే..

ఒక భూవివాదం నిమిత్తం.. జూనియర్ ఎన్టీఆర్.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్ విషయంలో ఈ వివాదం ప్రారంభం అయ్యింది. అసలేం జరిగిందంటే.. 2003లో గీత లక్ష్మీ అనే మహిళ నుంచి తారక్ ఈ ప్లాట్ ను కొనుగోలు చేశారు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అప్పటికే 1996 నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్లాట్ మీద ప్రాపర్టీ మోర్ట్ గెజ్ ద్వారా గీతలక్ష్మి కుటుంబం లోన్స్ తీసుకున్నారు.

ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి.. ఏకంగా మూడు, నాలుగు బ్యాంకుల వద్ద నుంచి లోన్ తీసుకుంది గీత లక్ష్మీ. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఈ ప్రాపర్టీ అమ్మే సమయంలో లోన్ల విషయాన్ని దాచి పెట్టింది గీత లక్ష్మి. ఇప్పటి వరకు ఆమె ఐదు బ్యాంకుల నుండి ఇదే ప్లాట్ డాక్యుమెంట్ మీద లోన్స్ తీసుకుంది.

కానీ తారక్ కు ప్లాట్ అమ్మే సమయంలో.. తాను కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్ట్ గేజ్ లోన్ తీసుకున్నట్లు చెప్పింది గీత లక్ష్మి. చెన్నై లోని ఒక బ్యాంక్ లో ఆ లోన్ ఉండగా.. దాన్ని క్లియర్ చేసి డాక్యుమెంట్ తీసుకున్నారు తారక్. 2003 నుండి ఆ ప్లాట్ ఒనర్ గా తారక్ ఉన్నారు. అప్పటినుండి పలు బ్యాంకు మేనేజర్లతో వివాదం కొనసాగుతుంది. తారక్ కొన్న ప్లాట్ ను స్వాధీనం చేసుకునేందుకు మిగతా బ్యాంకుల మేనేజర్లు ప్రయత్నం చేస్తున్నారు.

దాంతో ఆ బ్యాంకు మేనేజర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జూనియర్ ఎన్టీఆర్. 2019 లో ఇదే వ్యవహారంలో పోలీసులు ఛార్జి షీట్ దాఖలు చేశారు. అయితే ఈ వివాదంలో జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా డీఆర్టీ ఆర్డర్ వచ్చింది. దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జూనియర్. జూన్ 3 లోపు డీఆర్టీ డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయమని హై కోర్టు ఆదేశించింది. జూన్ 6న విచారణ చేపడతామని హైకోర్టు వెల్లడించింది. తెలిపింది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస మూవీలు చేస్తూ బిజీ గా వున్నారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ “దేవర” సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే. బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటుంది. దేవర సినిమాతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.