iDreamPost
android-app
ios-app

దుర్గం చెరువు నిర్వాసితులకు తెలంగాణ హైకోర్టులో ఊరట!

  • Published Sep 23, 2024 | 5:03 PM Updated Updated Sep 23, 2024 | 5:03 PM

Hyderabad: హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు నిర్వాసితులకు తెలంగాణ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఆ విషయంలో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.

Hyderabad: హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు నిర్వాసితులకు తెలంగాణ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఆ విషయంలో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.

  • Published Sep 23, 2024 | 5:03 PMUpdated Sep 23, 2024 | 5:03 PM
దుర్గం చెరువు నిర్వాసితులకు తెలంగాణ హైకోర్టులో ఊరట!

నగరంలో హైడ్రా హవా ఏ స్థాయిలో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఎక్కడ చూసిన హైడ్రా అక్రమ నిర్మాణాలను నిర్ధక్ష్యణంగా కూల్చివేస్తూ.. అక్రమదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా ఈ విషయంలో సామాన్యులు, ధనికులు అనే తేడా లేకుండా రూల్స్ కు భిన్నంగా ఉన్న అక్రమ నిర్మాణాలను గుర్తించి హైడ్ర తన ఉక్కుపాదం మోపుతుంది. దీంతో ప్రస్తుతం నగరంలోని అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారికి క్షణం క్షణం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ఎందుకంటే.. ఏ  వైపు నుంచి హైడ్రా తన బుల్డోజర్లు తో విరుచుకు పడుతుందోమోనని ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే నగరంలో రోజుకొక ప్రాంతంలో హైడ్రా అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటికి నోటిసులు ఇచ్చిన రెండు రోజుల వ్యవధిలోనే.. కూల్చివేస్తున్న విషయం తెలిసిందే.  అయితే నగరంలోని ఆ ప్రాంతం నిర్వాసితులకు మాత్రం ఈ విషయంలో కాస్త ఊరట లభించింది. ఇకపై ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంతకీ ఏం జరిగిందంటే..

తాజాగా హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు నిర్వాసితులకు తెలంగాణ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా ఆ పరిసరాల్లో ఉన్నఅక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హై కోర్టు  స్టే విధించి ఊరటను కలిగించింది. అలాగే అక్టోబర్ 4 వ తేదీన లేక్ ప్రోటక్షన్ ముందు హాజరు కావాలని నిర్వాసితులకు కోర్టు ఆదేశించింది. ఈ మేరకు  2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై దుర్గం చెరువు నిర్వాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో నిర్వాసితుల అబ్జెక్షన్స్‌పై లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోవాలని, ఈ క్రమంలోనే.. అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నిర్వాసితులు హాజరవుతారని,  ఇక వారి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్ 4 నుంచి ఆరు వారాలలోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశించింది.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే నగరంలోని హైడ్రా  30 ప్రాంతాల్లో దాదాపు  300 ఆక్రమణలను కూల్చి వేసినట్ల సమాచారం. అంతేకాకుండా.. ఆక్రమణలకు గురైన 120 ఎకరాలను హైడ్రా ప్రభుత్వానికి అప్పగించింది. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను కబ్జా చేస్తూ బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదు రావడంతో.. ఆయా ప్రాంతాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలిస్తున్నారు. ఏ మాత్రం అక్రమ నిర్మాణాలుగా గుర్తించిన వెంటనే వాటిని కూల్చివేయడంలో హైడ్రా దూకుడుగా వ్యవహారిస్తుంది. మరి, ప్రస్తుతం దుర్గమ్మ చెరువు నిర్వాసితులకు తెలంగాణ హైకోర్టు గుడ్ స్టే విధించి ఊరట కలిగించటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.