తెలంగాణ ఏర్పాటు తర్వాత మొదటి ఏడేళ్ల రాజకీయం ఒక ఎత్తు అయితే.. గడిచిన ఏడాది నుంచి జరుగుతున్న రాజకీయం మరో ఎత్తు. గడిచిన ఏడాది కాలం నుంచి తెలంగాణ రాజకీయం పూర్తిగా మారిపోయింది. కారణం బీజేపీ బలపడే ప్రయత్నాలు గట్టిగా చేస్తుండడం. బీజేపీ పార్టీ కేసీఆర్‌పైన, టీఆర్ఎస్ సర్కార్‌పై నిత్యం విమర్శలు, తరచూ ఆందోళనలు, నిరసనలు, ధర్నా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి వెళుతోంది. కేసీఆర్, కేటీఆర్‌లు కూడా ఆయా విమర్శలకు సమాధానం చెప్పకతప్పడం లేదు. ఇంతకు ముందు, […]
భారతీయ జనతా పార్టీ తన జోరు కొనసాగిస్తోంది. అనుమానాలను పటాపంచలు చేస్తూ మరోసారి విజయపతాకం ఎగురవేసింది. తాజాగా వెల్లడైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో నాలుగింటిని కైవసం చేసుకుంది. ఇక భవిష్యత్ లో జరిగే ఎన్నికల్లో బీజేపీ గురి ప్రధానంగా తెలంగాణపై ఉంది. ఇప్పటికే ఏడాదిన్నరగా రాష్ట్రంలో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పుడు తాజా ఎన్నికల ఫలితాల అనంతరం మరింత దూకుడు పెంచనుంది. యూపీ ప్రభావం తెలంగాణపై ఉంటుందని మొదటినుంచీ ప్రచారం జరుగుతూనే ఉంటుంది. అనుకున్నట్లే ఉత్తరప్రదేశ్‌ను మరోసారి […]
తెలంగాణ ప్రభుత్వ తాజా నిర్ణయంపై ప్రతిపక్షాలు దాడిని ముమ్మరం చేశాయి. కేసీఆర్ ఢిల్లీ పర్యటన తరువాత రాష్ట్రంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని కలిసిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి రావల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల గురించి చర్చించారు. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే 50 ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు జారిచేశారు. ముఖ్యమంత్రి ఈ నిర్ణయంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. ఆ వెంటనే.. అదే రాత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. హైదరాబాద్‌కు కేసీఆర్ వచ్చిన వెంటనే సంజయ్ ఢిల్లీకి బయలుదేరడంతో ఇరు పార్టీల్లోనూ దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో బీజేపీ నేతల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రతిపాదన పెట్టారని, దీనిపై చర్చించేందుకే బండికి పిలుపొచ్చినట్లు భావిస్తున్నారు. తెలంగాణాలో గత […]
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ వార్ లో బోర్లపడింది. క్రమంగా పట్టును కోల్పోతున్న హస్తానికి మరో షాక్ గట్టిషాక్ తగలనుంది. జీహెచ్ఎంసీ ఫలితాల వేళ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ఉద్యోగులు అభిప్రాయాన్ని ప్రతిబింభిస్తున్నాయన్న ఆయన సాధారణ ప్రజలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారంటూ ఆయన […]