iDreamPost
android-app
ios-app

తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు.. చంద్రబాబుపై ఈటల ఫైర్

  • Published Nov 02, 2023 | 3:04 PM Updated Updated Nov 02, 2023 | 3:04 PM

ఈటల రాజేందర్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో బాబు వేలు పెడుతున్నాడంటూ మండిపడ్డారు.

ఈటల రాజేందర్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో బాబు వేలు పెడుతున్నాడంటూ మండిపడ్డారు.

  • Published Nov 02, 2023 | 3:04 PMUpdated Nov 02, 2023 | 3:04 PM
తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు.. చంద్రబాబుపై ఈటల ఫైర్

తెలంగాణలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు విసృత ప్రచారం చేస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్త నేతల చేరికలతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు తలనొప్పిగా మారింది. కాగా ఈ సారి ఎలాగైనా తెలంగాణాలో అధికారం చేపట్టాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ లీడర్ ఈటల రాజేందర్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో బాబు వేలు పెడుతున్నాడంటూ మండిపడ్డారు. ఆడలేక మద్యల ఓడినట్లు చంద్రబాబు వ్యవహారం ఉందని దుయ్యబట్టారు.

ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల రాజేందర్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. జైళ్లోకెల్లి వచ్చిండో లేదో అప్పుడే తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడుతున్నాడంటూ ఆరోపించాడు. తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టిన చంద్రబాబు.. కాంగ్రెస్‌ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. బాబు జైలు నుంచి విడుదలైన తర్వాత కాంగ్రెస్‌ను పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారని ఈటల అన్నారు. బాబు కాంగ్రెస్ గెలుపుకు తెరవెనుక ప్రయత్నం చేస్తున్నారని ఈటల ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌పై ప్రజలకు విశ్వాసం లేదని, బీజేపీ వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఈటల అన్నారు.

ఏపీ స్కిల్ స్కామ్ కేసులో అరెస్టైన బాబుకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom