గత కొంతకాలంగా బయట ఎక్కడా 10 రూపాయలు నాణేలు తీసుకోవట్లేదు. ఆ నాణేలు పనికొస్తాయి అని ప్రభుత్వం, బ్యాంకుకు చెప్తున్నా ప్రజలు వాటిని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దీంతో ప్రజల వద్ద, కొన్ని షాపుల్లో 10 రూపాయల నాణేలు పేరుకొని ఉండిపోయాయి. తమిళనాడులోని ఆరూర్ కు చెందిన వెట్రివేల్ అనే ఓ వ్యక్తి తల్లి దుకాణం నడుపుకుంటూ ఉంటుంది. అక్కడకు వచ్చే కస్టమర్లు కూడా 10 రూపాయల కాయిన్స్ తీసుకోవటం మానేశారు. ఇది గమనించాడు వెట్రివేల్. వాళ్ళ షాప్ […]
తనని ప్రేమించలేదని ఓ యువకుడు ఇంటర్ బాలికని కత్తితో పొడిచి పారిపోయాడు. తమిళనాడులోని తిరుచ్చిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ చదివే ఓ బాలిక పరీక్షలు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా అప్పటికే ఆమె కోసం కాచుకొని ఉన్న కేశవన్ అనే యువకుడు బాలిక రావడంతోనే ఆమెపై కత్తితో దాడి చేసి 14 సార్లు పొడిచాడు. ఇదే యువకుడు గతేడాది బాలికను ప్రేమ పేరుతో వేధించడంతో పాటు బాలికను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించడంతో బాలిక కుటుంబ […]
స్టార్ హీరోలు కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ తో భారీ మల్టీస్టారర్ గా ‘విక్రమ్’ అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి తమిళ యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తుండగా కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జూన్ 3న ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. మరో తమిళ స్టార్ హీరో సూర్య కూడా ఇందులో ఓ ముఖ్య పాత్ర పోషించనున్నారు. ఇంతమంది స్టార్ హీరోలు ఒకే […]
ఇటీవల కేరళలో పాడైన షవర్మా(Shawarma) తిని ఒకరు మరణించి, పలువురు ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడు(Tamilanadu)లో ఈ షవర్మాని కొన్ని ప్రదేశాల్లో బ్యాన్ చేస్తున్నారు. తమిళనాడు ఆరోగ్య మంత్రి కూడా షవర్మా తినొద్దు, అది మన ఆహరం కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు వెల్లూరు జిల్లాలోని గుడియాథం మున్సిపాలిటీలో షవర్మాపై నిషేధం విధించారు. మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరితో మీటింగ్ పెట్టి తమ తమ మున్సిపాలిటీ పరిధిలో షవర్మాని నిషేధిస్తున్నట్టు ఆ నగర మేయర్ […]
అవును. ఇప్పుడు అమెరికా అష్టకష్టాల్లో ఉంది. ఆదిలో మేల్కొనకుండా చేసిన అలసత్వం వారి మెడకు చుట్టుకుంది. దాంతో ఇప్పుడు అన్ని దేశాల నుంచి మందులు, మెడికల్ కిట్ల కోసం పెద్ద స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. చివరకు వివిధ దేశాలకు వెళ్లాల్సిన వాటిని కూడా దారి మళ్లిస్తుందనే విమర్శలున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ దేశాలు అమెరికా మీద విమర్శలు చేశాయి. చైనా నుంచి తమకు రావాల్సిన మెడికల్ కిట్లు అమెరికా తరలించుకుపోయిందని వాపోయాయి. తాజాగా వారి జాబితాలో ఇండియా […]
రాజకీయ నేతలు, సినీ నటులకు గుడులు నిర్మించే తమిళనాడులో తాజాగా మరో గుడి వెలిసింది. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకాలకు ముగ్ధుడైన ఓ తమిళ రైతు మోదీకి గుడి కట్టాడు. తమిళనాడులోని తిరుచిరాపల్లికి 63 కిలోమీటర్ల దూరంలో ఉండే ఏరకుడి గ్రామం లో పి.శంకర్ అనే రైతు మోదీ గుడిని ప్రారంభించాడు. అక్కడ మోదీ ప్రతిమకు ప్రతిరోజూ హారతి ఇస్తున్నాడు. తను ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకాలతో లబ్ధి పొందానని, ఆయనంటే తనకెంతో అభిమానమని శంకర్ పేర్కొన్నాడు. […]