iDreamPost
android-app
ios-app

పది రూపాయల కాయిన్స్ తో రూ.6 లక్షల కారు కొన్నాడు.. కారణం తెలిస్తే మెచ్చుకోవలసిందే..

  • Published Jun 21, 2022 | 2:08 PM Updated Updated Jun 21, 2022 | 2:08 PM
పది రూపాయల కాయిన్స్ తో రూ.6 లక్షల కారు కొన్నాడు.. కారణం తెలిస్తే మెచ్చుకోవలసిందే..

గత కొంతకాలంగా బయట ఎక్కడా 10 రూపాయలు నాణేలు తీసుకోవట్లేదు. ఆ నాణేలు పనికొస్తాయి అని ప్రభుత్వం, బ్యాంకుకు చెప్తున్నా ప్రజలు వాటిని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దీంతో ప్రజల వద్ద, కొన్ని షాపుల్లో 10 రూపాయల నాణేలు పేరుకొని ఉండిపోయాయి. తమిళనాడులోని ఆరూర్ కు చెందిన వెట్రివేల్ అనే ఓ వ్యక్తి తల్లి దుకాణం నడుపుకుంటూ ఉంటుంది. అక్కడకు వచ్చే కస్టమర్లు కూడా 10 రూపాయల కాయిన్స్ తీసుకోవటం మానేశారు. ఇది గమనించాడు వెట్రివేల్.

వాళ్ళ షాప్ లోనే పెద్ద మొత్తంలో 10 రూపాయల నాణేలు మిగిలి పోయాయి. పిల్లలు కూడా 10 రూపాయల నాణేలు పనికిరావని అనుకుంటున్నారట. దీంతో వెట్రివేల్ 10 రూపాయల నాణేలు ఇచ్చి ప్రజలకు అవగాహన కల్పించేందుకు కారు కొనాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అప్పట్నుంచి 10 రూపాయల కాయిన్స్ కలెక్ట్ చేయటం మొదలెట్టాడు.

నెలరోజుల్లో దాదాపు ఆరు లక్షల రూపాయలు సరిపడా నాణేలను కలెక్ట్ చేసి కారుకొని వార్తల్లో నిలిచాడు. ఆరులక్షల రూపాయలకు సరిపడా 10 రూపాయల నాణేలు తీసుకుని కారు కొనడానికి వెళ్తే అక్కడి వాళ్ళు ఆ నాణేలు తీసుకోవడానికి వ్యతిరేకించారు. అయితే అతను ఎందుకు నాణెలతో కారు కొంటున్నాడో షాపు యజమానికి వివరించడంతో వాళ్ళు అంగీకరించారు. తన బంధువులతో కలిసి 10 రూపాయల నాణేల బస్తాలను షాపులోకి తీసుకువెళ్లగా ఆ కారు షోరూం సిబ్బంది వాటిని లెక్కపెట్టి కారు తాళాలను వెట్రివేల్ కు అందచేశారు. ఆరులక్షలతో మారుతుకి సుజుకి ఎకో కారుని కొనుక్కున్నాడు వెట్రివేల్ అతను చేసిన పనిని అభినందిస్తున్నారు.