iDreamPost
iDreamPost
స్టార్ హీరోలు కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ తో భారీ మల్టీస్టారర్ గా ‘విక్రమ్’ అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి తమిళ యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తుండగా కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జూన్ 3న ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. మరో తమిళ స్టార్ హీరో సూర్య కూడా ఇందులో ఓ ముఖ్య పాత్ర పోషించనున్నారు. ఇంతమంది స్టార్ హీరోలు ఒకే సినిమాలో ఉండటంతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏరపడ్డాయి.
అయితే ఇటీవలే విక్రమ్ సినిమా నుంచి పతళ పతళ అనే ఓ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటని కేవలం తమిళ భాషలోనే రిలీజ్ చేశారు. కమల్ హాసన్ స్వయంగా ఈ పాటని రాయగా అనిరుద్ సంగీతం అందించాడు. ఈ పాటని కమల్ హాసన్, అనిరుద్ కలిపి పాడారు. అయితే ఈ సాంగ్ లోని లిరిక్స్ వివాదానికి దారి తీశాయి.
ఈ సాంగ్‌లోని కొన్ని లైన్లు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టేలా ఉన్నాయని, కరోనా నిధులను పక్కదారి పట్టించారనేలా ఉన్నాయని, పాటలోని అర్ధం ప్రజలని తప్పుదారి పట్టించేలా ఉందని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేలా ఉందని చెన్నైకి చెందిన సామాజిక వేత్త సెల్వం అనే వ్యక్తి ఈ పాటపై కేసు నమోదు చేశారు. ఈ పాట రాసిన కమల్ హాసన్ పై కేసు నమోదు చేశారు.
గతంలో కూడా కమల్ హాసన్ పలు మార్లు బహిరంగంగానే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై తమిళనాడు బీజేపీ నాయకులు సైతం వ్యతిరేకత వ్యక్తం చేస్తూ మాట్లాడారు. సినిమాలో కూడా ఇలాంటివి ఉంటే అడ్డుకోవడానికి కూడా వెనుకాడం అని అన్నారు. అయితే ఈ వివాదంపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ స్పందించలేదు.