“కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందట” అని చెప్తుంటారు పెద్దలు.. ఈ విషయం తాజా ఘటనతో మరోసారి రుజువైంది. ఇప్పుడున్న రాజధాని అమరావతినుండి మార్చొద్దని టీడీపీ వితండవాదోద్యమం చేస్తున్న తరుణంలో సుప్రీంకోర్ట్ ఇచ్చిన ఝలక్ తో అసలు ఉద్యమ నినాదమే తప్పు అనే సంకేతాలు వెలువడుతున్నాయి. మూడు రాజధానులతో అభివృద్ధిని వికేంద్రీకరించాలని జగన్ సర్కార్ ముందుకెళ్తుంటే టీడీపీ శ్రేణులు జగన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అమరావతిలో ఆందోళనలు చేస్తున్నారు. కొందరైతే ఏకంగా న్యాయస్థానాల్ని సైతం ఆశ్రయించారు. అమరావతి […]
ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన రక్షణ రంగ ఉత్పత్తుల క్లస్టర్ (డిఫెన్స్ క్లస్టర్) ఏర్పాటుకి ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. బుదవారం ఉత్తరప్రదేశ్ రాజదాని లక్నోలో జరగుతున్న ఫ్రెంచ్-ఇండో డిఫెన్స్ ఎక్స్పో-2020 కార్యక్రమానికి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఫెన్స్ ఎక్స్పోకు హాజరైన 35 దేశాల ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ నేపధ్యంలో మంగళ […]
ఆంధ్రప్రదేశ్ లో పాలనా వికేంద్రీకరణ నిర్ణయంతో మొదలయిన రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారంలో తాజాగా ఆర్ఎస్ఎస్ తలదూర్చింది. ఏకంగా ముఖ్యమంత్రిని తుగ్లక్, జగ్లక్ అంటూ సంబోధించడమే కాకుండా, ఈ పరిణామాలు బీజేపీ బలోపేతానికి దోహదం చేస్తాయని, కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆ సంస్థ అధికారిక పత్రికలో వచ్చిన కథనం కలకలం రేపుతోంది. రాజకీయాలకు సంబంధం లేదని లిఖితపూర్వకంగా చెప్పిన ఆర్ఎస్ఎస్ రాజకీయం పలువురిని విస్మయ పరుస్తోంది. ఏపీ అభివృద్ధి విషయంలో ఎన్నడూ పట్టని కాషాయ సంస్థకు […]
రేపటినుండి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ అఖిల పక్ష సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో పాటు అన్ని పార్టీలకు సంభందించిన ఫ్లోర్ లీడర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి వైసిపి, తెలుగుదేశం ఫ్లోర్ లీడర్లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై అన్ని పార్టీలతో మాట్లాడుతున్న సందర్భంలో తెలుగుదేశానికి చెందిన […]
ఏపీ ముఖ్యమంత్రికి అనూహ్య మద్ధతు లభించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఎం ఎం పళ్లంరాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ నేతలు చంద్రబాబు అభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరిస్తుండగా పళ్లంరాజు మాత్రం భిన్నంగా స్పందించి ఆశ్చర్యపరిచారు. Read Also: జగన్ ని అభినంధించిన మహరాష్ట్ర ముఖ్యమంత్రి… ఇప్పటికే బీజేపీలో భిన్నస్వరాలు అందరికీ అర్థమవుతున్నాయి. జీవీఎల్ , సోము […]
ఈరోజు అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంధ్రీకరణ అంశాలపై జరిగిన చర్చలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నాబాబు మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలో పౌరులందరూ సమానమేనన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా సమాజ ప్రయోజనాలు ముఖ్యమని అన్నారు. అన్ని ప్రాంతాలతో సమానంగా వెనుకబడిన ప్రాంతాలను కూడా అభివృద్ధి చెయ్యాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉందన్నారు. గతంలో అభివృద్ధి వికేంధ్రీకరణ జరగగాపోవడం వల్లే తెలంగాణా ఉద్యమం వచ్చి రాష్ట్రం చీలిపోయిందని, ఆ అనుభవాల నుండి మనం ఇప్పటికైనా గుణపాఠం […]