సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను దిగ్గజ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సతీమణి, కుటుంబ సభ్యులు కలిశారు. సిరివెన్నెల కుటుంబాన్ని ఆదుకున్నందుకు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డితో సిరివెన్నెలకున్న అనుబంధాన్ని ముఖ్యమంత్రితో కుటుంబ సభ్యులు పంచుకున్నారు. సిరివెన్నెల అనారోగ్య సమయంలో చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకోవడం, ఆ కుటుంబానికి విశాఖలో ఇంటి స్ధలం మంజూరు చేయడంపై సీఎం జగన్ను కృతజ్ఞతలు తెలిపారు. సిరివెన్నెల కుటుంబానికి […]
పాటంటే పాటే. పాట గొప్పది. అది సిరివెన్నెల గారు రాస్తే ఇంకా గొప్పది. ఎన్ని రూల్స్ మధ్యలో ఒక పాట రాయాలి..? అది ట్యూనుకు రాయాలి. కథలో పాట ఉండాలి. పాటలో కథ ఉండాలి. సినిమాలో పాట ఇమడాలి. సినిమా తీసేసి పాట వింటే కూడా బాగుండాలి. డైరెక్టరు గారికి, హీరోగారికి పాట నచ్చాలి. హీరోగారి ఫ్యాన్స్ కు పడికట్టు పదాలు పడాలి. ఆడియెన్సుకి అర్ధ్యమయ్యే లెవెల్లో మాత్రమే ఉండాలి. పండితులని మెప్పించే పదప్రయోగం ఉండాలి. మేధావులని […]
‘సిరివెన్నెల’ సాహిత్యాన్ని విశ్లేషించడమా!?.. వినడమా!?.. ఏం చేద్దాం..? ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి పలుకు వెళ్లిపోయింది. కానీ, ఆయన పాట మనతోనే ఉంది. తెలుగు భాష ఉన్నంత కాలం సాహిత్యపు సిరి’వెన్నెల’ కురిపిస్తూ ఉంటుంది. అసలు, ఆయన పాట విశ్లేషించే స్థాయి ఎవరికి ఉంది? ఆయనకు తప్ప.. సీతారామశాస్త్రిగారు భౌతికంగా లేకపోయినా ఆయన పాటలు నింగి నేల ఉన్నంత కాలం జీవించే ఉంటాయి. కొన్ని లక్షల మందికి స్ఫూర్తి పాఠాలు నేర్పిస్తూనే ఉంటాయి. అలాంటి సరస్వతి పుత్రుల చివరి జ్ఞాపకాలు […]
తెలుగు చిత్రసీమ గర్వించదగ్గ గేయ రచయితల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకరు. ఆయన పాటల్లోని సాహిత్యం మనల్ని సూటిగా ప్రశ్నిస్తుంటుంది. ఆయన మూడు వేలకు పైగా పాటలు రాసినప్పటికీ కొన్ని పాటలు మాత్రం మనల్ని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. సీతారామశాస్త్రిగారు భౌతికంగా లేకపోయినా ఆయన పాటలు నింగి నేల ఉన్నంత కాలం జీవించే ఉంటాయి. కొన్ని లక్షల మందికి స్ఫూర్తి పాఠాలు నేర్పిస్తూనే ఉంటాయి. అలాంటి సరస్వతి పుత్రుల చివరి జ్ఞాపకాలు ప్రత్యక్షంగా పంచుకునే మహా యజ్ఞం ఐడ్రీంకే […]
తెలుగు సినిమా ప్రస్థానంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని లక్షలాది రచయితలకు గురువుగా మార్గదర్శిగా నిలిచిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు భౌతికంగా సెలవు తీసుకుని నెలలు గడుస్తున్నప్పటికీ ఆయన సరికొత్త సాహిత్యం సంగీత ప్రియులను పలకరిస్తూనే ఉంది. నిజానికి నాని శ్యామ్ సింగ రాయ్ శాస్త్రి గారి చివరి ఆల్బమని అందరూ అనుకున్నారు. అదే నిజం కూడా. వాస్తవానికి కెరీర్ లో ఆఖరిగా విడుదలైన సినిమానే అలా పరిగణనలోకి తీసుకుంటారు. కానీ సిరివెన్నెల కన్నుమూసే సమయానికి అప్పటికే […]
టాలీవుడ్ లో వరుస విషాదాలు కలవరం లేకుండా చేస్తున్నాయి. ఇటీవల శివ శంకర్ మాస్టర్ కన్ను మూయగా ఇప్పుడు అస్వస్థతకు గురై కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ లిరిసిస్ట్ రచయిత సిరివెన్నెల సీతా రామశాస్త్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని వైద్యులు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.నిమోనియా కారణంగా నవంబర్ 24న సిరివెన్నెల.. సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే ఐసీయూలో చికిత్స […]