iDreamPost
android-app
ios-app

సిరివెన్నెల జగమంత కుటుంబం.. 5వ భాగం విడుదల..

సిరివెన్నెల జగమంత కుటుంబం..  5వ భాగం విడుదల..

  • ‘సిరివెన్నెల’ సాహిత్యాన్ని విశ్లేషించడమా!?.. వినడమా!?.. ఏం చేద్దాం..?

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి పలుకు వెళ్లిపోయింది. కానీ, ఆయన పాట మనతోనే ఉంది. తెలుగు భాష ఉన్నంత కాలం సాహిత్య‌పు సిరి’వెన్నెల’ కురిపిస్తూ ఉంటుంది. అసలు, ఆయన పాట విశ్లేషించే స్థాయి ఎవరికి ఉంది? ఆయనకు తప్ప..

సీతారామశాస్త్రిగారు భౌతికంగా లేకపోయినా ఆయన పాటలు నింగి నేల ఉన్నంత కాలం జీవించే ఉంటాయి. కొన్ని లక్షల మందికి స్ఫూర్తి పాఠాలు నేర్పిస్తూనే ఉంటాయి. అలాంటి సరస్వతి పుత్రుల చివరి జ్ఞాపకాలు ప్రత్యక్షంగా పంచుకునే మహా యజ్ఞం ఐడ్రీంకే దక్కడం పూర్వజన్మ సుకృతం. సంస్థ అధినేత చిన్నవాసుదేవరెడ్డి గారి మూడేళ్ళ నిర్విరామ కృషి ఫలించి గురువు గారు తను రచించిన వేల పాటల ప్రస్థానాన్ని సవివరంగా ప్రపంచానికి చెప్పే బృహత్కార్యానికి ఒప్పుకోవడం అదృష్టం. ఆ క్రతువు సంపూర్ణంగా పూర్తి కాకపోయినా చివరి రోజుల వరకు సిరివెన్నెల గారు పంచుకున్న ఎన్నో అద్భుత రసస్పందనలు ఇందులో చూడబోతున్నాం.

‘కవిత్వం కానిది నేను రాయలేను’ – ఓసారి సిరివెన్నెల చెప్పిన మాట!ఆయన రాసింది కవిత్వమా? కాదా?విశ్లేషించగల స్థాయి ఎంతమందికి ఉంది!?అసలు, విశ్లేషిస్తున్నది ఎంతమంది? వింటున్నది ఎంతమంది?ఇటువంటి సందేహాలు ఎప్పుడూ ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రికి రాలేదు.ప్రేక్షకుల స్థాయిని ఆయనెప్పుడూ తక్కువ చేయలేదు. పాట కోరిన భావంలో రాశారు. అదీ ఆయన గొప్పదనం.’సిరివెన్నెల’ రాసిన భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రేక్షకులు ప్రయత్నించారు. ప్రేక్షకులు ప్రయత్నించేలా చేశారు. అదే ఆయన ప్రత్యేకత.

Chinna Vasudeva Reddy (@ChinnaVasudeva) / Twitter

 

  • ‘సిరివెన్నెల’ ఎటువంటి పాటలు రాశారు? ఒక్క ముక్కలో సమాధానం చెప్పడం కష్టం. అది అసాధ్యం కూడానూ!

‘సిరివెన్నెల’లో ప్రేమికుడు ఉన్నారు.. భాషా ప్రేమికుడూ ఉన్నారు. ఓ శ్రామికుడు ఉన్నారు.. మంచి సినిమాకు పాటుపడే శ్రామికుడూ ఉన్నారు.ప్రజల్ని చైతన్యం చేసే విప్లవకారుడు ఉన్నారు.. విషాదంలో ఉన్నప్పుడు తోడుండే స్నేహితుడు ఉన్నారు.మనలో నిరాశ, నిస్పృహలను పారద్రోలే స్ఫూర్తి ప్రధాత ఉన్నారు.అన్నిటికంటే ముఖ్యంగా గొప్ప ఆశావాది ఉన్నారు.

భయపడుతూ బతకడం కంటే.. చచ్చి బతికిపోదామనే పరిస్థితి ఇప్పుడు ఉంది.. ఓపెన్‌హార్ట్‌లో సిరివెన్నెల | sirivennela seetharama sastry open heart with rk part 1 spl-MRGS-Open Heart

‘సిరివెన్నెల’లో లేనిదెవ్వరు? అందరూ ఉన్నారు. ‘సిరివెన్నెల’ రాసిన పాటల్లో లేనిదేమిటి? అన్నీ ఉన్నాయి. నవరసాలు ఉన్నాయి. మనకు కావాల్సిన పాటను, మనసు కోరిన సమయంలో వింటుంటామంతే!

విధాత తలపున ప్రభవించిన ఈ లలిత ప్రియ కమలాలను పంచుకోవడానికి తన దరికి చేరలేని శిష్యుల కోసం ఎగసే అలకు లేనట్టే ఏ అలుపు లేకుండా సీతారామశాస్త్రి గారు ఎంతో ఓపిగ్గా ఒద్దికగా రచనా అనుభవాలను వివరించారు. ఇవి వర్తమాన రచయితల కోసమో ఆయన్ను అభిమానించే అశేష జనవాహిని కోసం మాత్రమే కాదు. భవిష్యత్ తరాలు ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప సాహితి సంపద గురించి తెలుసుకోవడం కోసం ఈ నిధిని ఇలా ముఖాముఖీ రూపంలో అందించడం జరుగుతుంది. ఆయన ప్రతి మాట అక్షరామృతం, ప్రతి పలుకు అద్వితీయం. అందుకుందాం, సీతారామశాస్త్రి గారి జ్ఞాపకాల్లో ఓలలాడుదాం..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి