iDreamPost
android-app
ios-app

సీఎం జ‌గ‌న్ ను క‌లిసిన సిరివెన్నెల కుటుంబ స‌భ్యులు

  • Published Jan 25, 2023 | 7:53 PM Updated Updated Jan 25, 2023 | 8:11 PM
  • Published Jan 25, 2023 | 7:53 PMUpdated Jan 25, 2023 | 8:11 PM
సీఎం జ‌గ‌న్ ను క‌లిసిన సిరివెన్నెల కుటుంబ స‌భ్యులు

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను దిగ్గజ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సతీమణి, కుటుంబ సభ్యులు క‌లిశారు. సిరివెన్నెల కుటుంబాన్ని ఆదుకున్నందుకు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో సిరివెన్నెలకున్న‌ అనుబంధాన్ని ముఖ్యమంత్రితో కుటుంబ సభ్యులు పంచుకున్నారు. సిరివెన్నెల అనారోగ్య సమయంలో చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకోవడం, ఆ కుటుంబానికి విశాఖలో ఇంటి స్ధలం మంజూరు చేయడంపై సీఎం జగన్‌ను కృతజ్ఞతలు తెలిపారు. సిరివెన్నెల కుటుంబానికి అవసరమైనంత మేర ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఇస్తామ‌ని సీఎం జ‌గ‌న్ భరోసానిచ్చారు. సిరివెన్నెల సతీమణి పద్మావతి, కుమారులు యోగేశ్వర శర్మ, రాజా, కుమార్తె శ్రీలలితా దేవి, సిరివెన్నెల సోదరుడు సీఎస్‌.శాస్త్రిలు సీఎంని కలిశారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş