iDreamPost
android-app
ios-app

సిరివెన్నెల జగమంత కుటుంబం.. 4వ భాగం విడుదల..

సిరివెన్నెల జగమంత కుటుంబం..  4వ భాగం విడుదల..

తెలుగు చిత్రసీమ గర్వించదగ్గ గేయ రచయితల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకరు. ఆయన పాటల్లోని సాహిత్యం మనల్ని సూటిగా ప్రశ్నిస్తుంటుంది. ఆయన మూడు వేలకు పైగా పాటలు రాసినప్పటికీ కొన్ని పాటలు మాత్రం మనల్ని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి.

సీతారామశాస్త్రిగారు భౌతికంగా లేకపోయినా ఆయన పాటలు నింగి నేల ఉన్నంత కాలం జీవించే ఉంటాయి. కొన్ని లక్షల మందికి స్ఫూర్తి పాఠాలు నేర్పిస్తూనే ఉంటాయి. అలాంటి సరస్వతి పుత్రుల చివరి జ్ఞాపకాలు ప్రత్యక్షంగా పంచుకునే మహా యజ్ఞం ఐడ్రీంకే దక్కడం పూర్వజన్మ సుకృతం. సంస్థ అధినేత చిన్నవాసుదేవరెడ్డి గారి మూడేళ్ళ నిర్విరామ కృషి ఫలించి గురువు గారు తను రచించిన వేల పాటల ప్రస్థానాన్ని సవివరంగా ప్రపంచానికి చెప్పే బృహత్కార్యానికి ఒప్పుకోవడం అదృష్టం. ఆ క్రతువు సంపూర్ణంగా పూర్తి కాకపోయినా చివరి రోజుల వరకు సిరివెన్నెల గారు పంచుకున్న ఎన్నో అద్భుత రసస్పందనలు ఇందులో చూడబోతున్నాం.

విధాత తలపున ప్రభవించిన ఈ లలిత ప్రియ కమలాలను పంచుకోవడానికి తన దరికి చేరలేని శిష్యుల కోసం ఎగసే అలకు లేనట్టే ఏ అలుపు లేకుండా సీతారామశాస్త్రి గారు ఎంతో ఓపిగ్గా ఒద్దికగా రచనా అనుభవాలను వివరించారు. ఇవి వర్తమాన రచయితల కోసమో ఆయన్ను అభిమానించే అశేష జనవాహిని కోసం మాత్రమే కాదు. భవిష్యత్ తరాలు ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప సాహితి సంపద గురించి తెలుసుకోవడం కోసం ఈ నిధిని ఇలా ముఖాముఖీ రూపంలో అందించడం జరుగుతుంది. ఆయన ప్రతి మాట అక్షరామృతం, ప్రతి పలుకు అద్వితీయం. అందుకుందాం, సీతారామశాస్త్రి గారి జ్ఞాపకాల్లో ఓలలాడుదాం.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet giriş