iDreamPost
android-app
ios-app

Sirivennela Seetharama Sastry : ‘సిరివెన్నెల’ అస్తమయం

Sirivennela Seetharama Sastry : ‘సిరివెన్నెల’ అస్తమయం

టాలీవుడ్ లో వరుస విషాదాలు కలవరం లేకుండా చేస్తున్నాయి. ఇటీవల శివ శంకర్ మాస్టర్ కన్ను మూయగా ఇప్పుడు అస్వస్థతకు గురై కిమ్స్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ లిరిసిస్ట్ రచయిత సిరివెన్నెల సీతా రామశాస్త్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని వైద్యులు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.నిమోనియా కారణంగా నవంబర్ 24న సిరివెన్నెల.. సికింద్రాబాద్​లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే ఐసీయూలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. న్యుమోనియాతో ఈ నెల 24 నా సికింద్రాబాద్ కిమ్స్ లో చేరిన సీతారామశాస్త్రి, లంగ్ క్యాన్సర్ సంబంధిత లక్షణాలతో మరణించారు. మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో మూడు వేలకు పైగా పాటలు రాశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి.

అనకాపల్లిలో జన్మించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి సినీ లిరిక్ రైటర్ గా బాలకృష్ణ హీరోగా కళా తపస్వి కే. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనని జన్మభూమి’ సినిమాతో తన కెరీర్ ప్రారంభించారు. అయితే ఆయనకు పేరు తీసుకొచ్చింది మాత్రం సిరివెన్నెల సినిమానే. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం` అంటూ సిరివెన్నెల రాసిన పాటకు నంది అవార్డు కూడా లభించింది. చివరిగా ఆయన అఖిల్‌ నటించిన `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంలో `చిట్టు అడుగు` అనే పాటని రాశారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఆయన ఆర్ ఆర్ ఆర్ లో దోస్తీ సాంగ్ కూడా రెడీ చేశారు. వేటూరి శిష్యుడిగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న సిరివెన్నెల గేయ రచయిత మాత్రమే కాదు, కవి, సింగర్‌ కూడా. `గాయం` సినిమాలో `నిగ్గదీసి అడుగు.. `అనే పాట ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే.

జనాన్ని చైతన్య పరిచే ఈ పాటలో కనిపించిన ఆయన ఊర్రూతలూగించారు. అలా గాయకుడిగా సిరివెన్నెల లోని మరో కోణాన్ని ఆవిష్కరించింది ఆ సినిమా. ఇక సిరివెన్నెల సినీ సాహిత్యానికి చేసిన సేవలకుగానూ `2019లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఇక సుదీర్ఘ కెరీర్ లో ఆయన దాదాపు 11 నంది అవార్డులు అందుకున్నారు. నాలుగు ఫిల్మ్​ఫేర్​ పురస్కారాలు వరించాయి. 2019లో ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. మొత్తంగా ఆయన సిరివెన్నెల`, `శృతి లయలు`, `స్వర్ణకమలం`, `గాయం`, `శుభలగ్నం`, `శ్రీకారం`, `సింధూరం`, `ప్రేమ కథ`, `చక్రం`, `గమ్యం`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` వంటి సినిమాల్లో పాటలకు అవార్డులు అందుకున్నారు

Also Read :

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి