సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ చంద్రముఖి ఎంత పెద్ద బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2005లో రిలీజైన ఈ సినిమాలో జ్యోతిక నటన, లకలక అంటూ వెరైటీగా ఇచ్చిన రజిని మ్యానరిజంస్, విద్యాసాగర్ పాటలు ఒకటా రెండా అన్ని అంశాలు మూకుమ్మడిగా పని చేసే దాన్ని ఇండస్ట్రీ హిట్ చేసేశాయి. అప్పట్లో తెలుగు వెర్షన్ సైతం వంద రోజులు ఆడిందంటే దీని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ […]
ఇప్పటితరం ప్రేక్షకులకు అంతగా అవగాహన ఉండకపోవచ్చు కానీ 90 దశకంలో యూత్ కి మాత్రం హీరోయిన్ శోభన ఖచ్చితంగా గుర్తుంటారు. విజయశాంతి, రాధ లాంటి గ్లామర్ భామల డామినేషన్ ని తట్టుకుని ఎలాంటి స్కిన్ షోలు చేయకుండా మంచి సినిమాలు మాత్రమే ఏరికోరి చేసిన నటిగా అప్పట్లో తనకు పెద్ద హిట్లే పడ్డాయి. చిరంజీవి రౌడీ అల్లుడు, బాలకృష్ణ నారీ నారీ నడుమ మురారి, నాగార్జున రక్షణ, వెంకటేష్ అజేయుడు, మోహన్ బాబు రౌడీ గారి పెళ్ళాం, […]
ఇప్పుడంటే మనోభావాలు చాలా సున్నితంగా ఉన్నాయి కాబట్టి కులమతాలకు సంబంధించిన ఎలాంటి సబ్జెక్టు అయినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరీ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ అలాంటివేవి లేని 80 దశకంలో సున్నితమైన కుల వ్యవస్థ అంశం మీద సున్నితంగా సరదాగా ఆలోచింపజేసిన సినిమా ఒకటొచ్చింధి. దాని పేరు ‘నేనూ మీ వాడినే’. 1988 సంవత్సరంలో భాగ్య రాజా హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో తమిళ్ లో వచ్చిన ‘ఇదు నమ్మ ఆలు’కు తెలుగు డబ్బింగ్ […]
ఒక అందాన్ని వర్ణించాలన్నా అంతకన్నా గొప్పగా చూపించాలన్నా మన హీరోయిన్ల కంటే మంచి ఛాయస్ ఎవరూ ఉండరు. విశ్వనాథ్ గారి కళాకావ్యాలు మొదలుకుని రాఘవేంద్రరావు గారి కమర్షియల్ గ్లామర్ సూత్రాల దాకా ప్రేక్షకులను మైమరిపింపజేయడం వీళ్ళకే చెల్లింది. దీన్ని మరోసారి ఇంకో కోణంలో ఋజువు చేయడానికి నడుం బిగించారు మన సౌత్ భామలు. ప్రముఖ మాజీ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుహాసిని మణిరత్నం ఆద్వర్యంలో నామ్ అనే స్వచ్చంద సంస్థ చెన్నై కేంద్రంగా పని చేస్తోంది. ఇటీవలే […]