iDreamPost
android-app
ios-app

రవివర్మ అందాలలో సినీభామలు

  • Published Feb 04, 2020 | 5:45 AM Updated Updated Feb 04, 2020 | 5:45 AM
  • Published Feb 04, 2020 | 5:45 AMUpdated Feb 04, 2020 | 5:45 AM
రవివర్మ అందాలలో సినీభామలు

ఒక అందాన్ని వర్ణించాలన్నా అంతకన్నా గొప్పగా చూపించాలన్నా మన హీరోయిన్ల కంటే మంచి ఛాయస్ ఎవరూ ఉండరు. విశ్వనాథ్ గారి కళాకావ్యాలు మొదలుకుని రాఘవేంద్రరావు గారి కమర్షియల్ గ్లామర్ సూత్రాల దాకా ప్రేక్షకులను మైమరిపింపజేయడం వీళ్ళకే చెల్లింది. దీన్ని మరోసారి ఇంకో కోణంలో ఋజువు చేయడానికి నడుం బిగించారు మన సౌత్ భామలు. ప్రముఖ మాజీ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుహాసిని మణిరత్నం ఆద్వర్యంలో నామ్ అనే స్వచ్చంద సంస్థ చెన్నై కేంద్రంగా పని చేస్తోంది.

ఇటీవలే వినూత్నమైన రీతిలో క్యాలెండర్లు ప్రింట్ చేసి వాటిని అందించాలనే ఉద్దేశంతో సుప్రసిద్ధ చిత్రకారులు రవివర్మ గారు గీసిన కొన్ని అద్భుతమైన పెయింటింగ్స్ ని నిన్నటి మరియు ఇప్పటి తరం హీరోయిన్లతో ఫోటో షూట్ ద్వారా రీ క్రియేట్ చేసే బాధ్యతను తీసుకుంది. అచ్చం అచ్చుగుద్దినట్టు రవివర్మ ఏ అందాలనైతే తన బొమ్మల ద్వారా చూపించారో వాటికి ఏ మాత్రం తీసిపోని రీతిలో మన హీరోయిన్లు స్టిల్స్ ఇవ్వడం విశేషం.

ఈ క్యాలెండర్ లో సమంతా, ఐశ్వర్య రాజేష్, శృతి హాసన్, ఖుష్బూ, రమ్యకృష్ణ, శోభన, నదియా తదితరులు ఇచ్చిన పోజులు చిరకాలం భద్రపర్చుకునేంత సహజంగా ఉన్నాయి. దీని కోసం ప్రముఖ ఫోటోగ్రాఫర్ వెంకట్ రామ్ తన టీమ్ తో కలిసి చేసిన కృషి నిజంగా చాలా గొప్పది. న్యాచురల్ ఫీల్ చెడిపోకుండా ఉండటం కోసం లైటింగ్, మేకప్, ఎక్స్ ప్రెషన్స్ విషయంలో వీళ్ళు తీసుకున్న శ్రద్ధ ఆణువణువూ కనిపిస్తుంది. ఇప్పుడీ పిక్స్ సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉన్నాయి. రవివర్మ చూసినా అచ్చెరువొందేలా రూపుదిద్దుకున్న ఈ ఫోటోగ్రాఫ్స్ వల్ల ఆ క్యాలెండర్లకు డిమాండ్ వచ్చేస్తోంది. ఎక్కడ దొరుకుతాయని అప్పుడే ఎంక్వయిరీలు కూడా మొదలయ్యాయట. కళ ఏ రూపంలో అయినా సజీవంగా చూపడంలో దక్షణాది ప్రతిభ ఎంత గొప్పదో మరోసారి ఋజువయ్యిందిగా

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom