నిన్న విరాట పర్వం సందడి ఎక్కువగా కనిపించడంతో సత్యదేవ్ గాడ్సే రిలీజైన విషయం అంతగా సామాన్య ప్రేక్షకుల దృష్టిలో పడలేక పోయింది. అయినప్పటికీ ట్రైలర్లు ఈవెంట్లు గట్రా ప్రమోషన్లు చేయడంతో కొంత బజ్ అయితే వచ్చింది. అందులోనూ బ్లఫ్ మాస్టర్ హీరో దర్శకుడి కాంబినేషన్ కావడం వల్ల బాగుండొచ్చనే నమ్మకం ఫ్యాన్స్ లో కనిపించింది. ఇది కూడా కరోనా వల్ల పలుమార్లు వాయిదా పడిన బాపతే. డేట్లు మారుతూ ఫైనల్ గా 17న లాక్ చేసుకుని థియేటర్లలో […]
వచ్చే వారం విడుదల కాబోతున్న విరాటపర్వంతో పాటుగా థియేటర్లలో అడుగు పెడుతున్నాడు గాడ్సే. మహాత్మగాంధిని చంపిన ఉగ్రవాదిగా ముద్రపడిన వ్యక్తి పేరుని సినిమాకు పెట్టుకోవడం దగ్గరి నుంచే ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తిని రేపింది. సత్యదేవ్ టైటిల్ రోల్ పోషించిన ఈ సోషల్ డ్రామా ట్రైలర్ ని ఇందాక గ్రాండ్ గా రిలీజ్ చేశారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు హాజరు కాగా ఈ వేడుకని నిర్వహించారు. అంచనాల పరంగా ఏమంత బజ్ లేని గాడ్సేకు ప్రమోషన్ వేగవంతం […]
కొంచెం నెమ్మదిగానే అయినా టాలీవుడ్ లోనూ ఓటిటి సినిమాల సంఖ్య మెల్లగా పెరుగుతోంది. ఈ నెల 19న కీర్తి సురేష్ పెంగ్విన్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇది డబ్బింగ్ మూవీ. కాని స్ట్రెయిట్ సినిమాల పరంగా చూసుకుంటే పేరున్న ఆర్టిస్టులు నటించినవి ఇప్పటిదాకా పెద్దగా రాలేదు. ఒక్కొక్కటిగా రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. సత్యదేవ్ నటించిన 47 డేస్ జూన్ 30 నుంచి జీ 5 యాప్ లో ప్రీమియర్ కాబోతోంది. చాలా కాలం నుంచి […]