iDreamPost
android-app
ios-app

సత్యదేవ్ కెరీర్లో బెస్ట్ లవ్ డ్రామా.. OTTలో ఉంది చూశారా?

OTT Suggestions- Guvva Gorinka Movie: విలక్షణ నటుడు సత్యదేవ్ కెరీర్లో అద్భుతమైన సినిమాలు చేశాడు. హీరోగా, విలన్ గా.. అయితే సత్యదేవ్ కెరీర్లో ఉన్న ఈ లవ్ స్టోరీ గురించి చాలా మందికి తెలియదు. ఓటీటీలో ఉంది ఒకసారి చూసేయండి.

OTT Suggestions- Guvva Gorinka Movie: విలక్షణ నటుడు సత్యదేవ్ కెరీర్లో అద్భుతమైన సినిమాలు చేశాడు. హీరోగా, విలన్ గా.. అయితే సత్యదేవ్ కెరీర్లో ఉన్న ఈ లవ్ స్టోరీ గురించి చాలా మందికి తెలియదు. ఓటీటీలో ఉంది ఒకసారి చూసేయండి.

సత్యదేవ్ కెరీర్లో బెస్ట్ లవ్ డ్రామా.. OTTలో ఉంది చూశారా?

ఓటీటీల్లో బాగా సేల్ అయ్యే సినిమాలు అంటే.. ఒకటి హారర్ థ్రిల్లర్స్, రెండు లవ్ స్టోరీలు. వీటికి ఫుల్ డిమాండ్ ఉంటడం వల్ల ఓటీటీల్లో ఉన్న ప్రేమకథలను ఈ ఆడియన్స్ ఖాళీ చేసి పారేశారు. ఏ కొత్త ప్రేమకథ దొరక్కా తెగ ఇబ్బంది పడుతున్నారు. అందుకే మీకోసం ఒక క్రేజీ లవ్ స్టోరీని తీసుకొచ్చాం. అది కూడా మన విలక్షణ నటుడు, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించింది. సత్యదేవ్ హీరోగా చేసిన సినిమాల్లో ఇది ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఇందులో పెద్దగా కొత్త కథ ఏమీ ఉండదు. కానీ, క్లయిమ్యాక్స్ లో మాత్రం ఒక మంచి ప్రేమకథ చూశాం అనే భావన కలుగుతుంది. మరి.. ఆ మూవీ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

సత్యదేవ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే సత్యదేవ్ టాలెంట్ ఏంటి? ఎంత బాగా నటించగలడో చూశాం. అలాగే హీరోగానే కాకుండా.. విలన్ కూడా తన సత్తా చాటాడు. అలాంటి సత్యదేవ్ కెరీర్లో ఉన్న ఈ ఫీల్ గుడ్ మూవీ గురించి చాలామందికి తెలియకపోవచ్చు. నిజానికి ఇది అండర్ రేటెడ్ జమ్ అనచ్చు. మీరు గనుక సత్యదేవ్ యాక్టింగ్ కి అభిమాని అయితే మీకు ఈ మూవీ ఇంకా బాగా నచ్చుతుంది. ఈ సినిమా కథ చాలా సింపుల్ గా ఉంటుంది. హీరోయిన్ కి సంగీతం అంటే ఇష్టం. కానీ, అందుకు ఫ్యామిలీ ఒప్పుకోదు. వైలెన్ నేర్చుకోవడానికి హైదరాబాద్ వెళ్లాలి అంటే.. ఇంట్లో చూపించిన అబ్బాయినే చేసుకుంటాను అని మాటిచ్చాకే వాళ్ల నాన్న పంపిస్తాడు.

ఇంక హీరో విషయానికి వస్తే.. ఈయనకి సంగీతం కాదు.. చిన్న సౌండ్ అన్నా పడదు. చాలా ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాడు. అలాంటి వ్యక్తికి రూమ్ మేట్ గా సంగీత సరస్వతి వస్తుంది. ఆమె వైలెన్ వాయిస్తుంటే.. సత్యదేవ్ మాత్రం చెవులు మూసుకుంటూ నానా యాగి చేస్తాడు. ఇలా భిన్న ధృవాలుగా ఉన్న ఇద్దరూ ఎలా కలిశారు అనేదే ఇక్కడ కథ. ఈ మధ్యలో చాలానే డ్రామా నడుస్తుంది. వీళ్లద్దరి మధ్య గిల్లిగజ్జాలు బాగా మెప్పిస్తాయి. ఇద్దరికి ఒక్క నిమిషం పడదు.

కానీ, ఇద్దరు ఒకిరికి ఒకరు పడిపోతారు. అది ఎలా జరిగింది అనేదే ఇక్కడ పాయింట్. తనకు పెద్దలు పెళ్లి చేయబోతున్నారు అనే విషయాన్ని హీరోయిన్ సత్యదేవ్ కు చెప్పదు. తీరా ప్రేమలో పడ్డాక అసలు విషయం తెలుస్తుంది. అక్కడ వచ్చే ఎమోషనల్ సీక్వెన్స్ మెప్పిస్తుంది. వీటికి అదనంగా ప్రియదర్శి చేసే కామెడీ.. ప్లే బాయ్ లాగా మనోడు చేసే పాత్ర అలరిస్తుంది. ఈ సినిమా పేరు గువ్వ గోరింక. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి