ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నాలుగు స్థానాల్లో అసెంబ్లీలో ఉన్న స్పష్టమైన ఆధిక్యత దృష్యా మొత్తం నాలుగింటికి నాలుగు స్థానాలు వైసిపి నే సునాయాసంగా గెలుచుకుంటుందనే విషయంలో మొదటినుండి ఎవరికీ ఎటువంటి సందేహం లేనప్పటికీ, వైసిపి నుండి రాజ్యసభకు ఎన్నికయ్యే అభ్యర్థులపై మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వైసిపి రాజ్యసభ అభ్యర్థులు వీరేనంటూ కొందరు తలపండిన రాజకీయ నేతల పేర్లు.. పలువురు వ్యాపారవేత్తల పేర్లు.. కొందరు సినీ ప్రముఖులు ఇలా పలువురి పేర్లు, […]
జమ్మలమడుగు నియోజకవర్గంలో చదిపిరాళ్ల కుటుంబానిది కండబలమైతే తాతిరెడ్డి కుటుంబానిది రాజకీయ, ఆర్థిక అండ. జమ్మలమడుగు నియోజకవర్గంలో 1951 నుంచీ తాతిరెడ్డి కుటుంబీకులు ఎమ్మెల్యే పదవికీ పోటీ చేస్తూ వస్తున్నారు. రెండు సార్లు తాతిరెడ్డి పుల్లా రెడ్డి ఓడిపోగా, తాతిరెడ్డి నరసింహారెడ్డి (టీఎన్‌ఆర్) రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం ఆవిర్భాం నుంచి శివారెడ్డి (బాంబుల శివారెడ్డి) హవా మొదలైంది. వారి ప్రత్యర్థులుగా అనేక మంది కాంగ్రెస్ తరఫున పోటీ చేసినా 2004 వరకూ ఎవరూ గెలవలేకపోయారు. 1985 […]
ఏపీలో రాజ్యసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తనకు అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్న ఇద్దరు మంత్రులకు పార్లమెంట్ లో అడుగుపెట్టే అవకాశం కల్పించారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఈ సీనియర్ నేతలిద్దరూ స్టేట్ నుంచి సెంటర్ రాజకీయాలకు మారుతుండడం విశేషంగా మారుతోంది. ఈ ఇద్దరు 1989 ఎన్నికల నుంచే తెరమీదకు వచ్చారు. అయితే అప్పట్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ తూగో జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి విజయం సాధించి వైఎస్సార్ వర్గీయుడిగా కొనసాగగా, […]
చినబాబూ మీరు ఎక్కడున్నా తక్షణమే ఇంటికి రావాలి..మీరు మాకు కనిపించక చాలా రోజులు అవుతోంది..ఈ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయినా నిన్ను ఎవరూ ఏమీ అనరు… నీ మీద బెంగెట్టు కున్నాం..గమ్మున ఇంటికి రావాలని మా కోరిక .. ఇదీ ఓ హార్డ్ కోర్ టిడిపి కార్యకర్తలు ఇలా కోరుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ చినబాబు లోకేష్ హవా అంతా ఇంతా కాదు.. ఆయన జోక్యం లేని నియోజకవర్గం గాని, డిపార్ట్మెంట్ గానీ లేదన్నది జగద్విదితం. కర్నూల్ ఉప […]
గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో తన ఉనికిని తిరిగి నిరూపించుకునే అవకాశం స్థానిక ఎన్నికల రూపంలో వచ్చిందని అందరూ భావించినా, ఆ దిశగా కేడర్ లో జోష్ రాకపోగా ముఖ్యనేతలే పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన వెంటనే కడప జిల్లాలో తెలుగుదేశం పార్టికి పెద్ద దిక్కుగా ఉన్న సి.యం రమేష్ , ఆదినారాయణ రెడ్డి, బాలకృష్ణ యాదవ్ బి.జే.పిలో చేరిపోగా వీరిని […]
తంతే గారెల బుట్టలో పడటం అంటే ఇదే… ఎన్నికల్లో ఓడిపోతే మంత్రి పదవులు వొచ్చాయి… శాసనమండలి రద్దయితే ఏకంగా రాజ్యసభ స్థానం దక్కింది…. లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన చిదంబరం,అరుణ్ జైట్లీ లాంటి నాయకులకు కేంద్రంలో మంత్రిపదవులు అనేకసార్లు వొచ్చాయి కానీ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులకు రాష్ట్రంలో మంత్రిపదవులు రావటం చాలా అరుదు.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి ఒకరిద్దరు నాయకులకు ఓడిపోయిన సంవత్సరానికో, రెండేళ్లకో మంత్రి పదవులు వొచ్చాయి. కానీ మొన్నటి ఎన్నికల్లో వైసీపీ […]
వైఎస్సార్‌సీపీ తరఫున రాజ్యసభకు వెళ్లబోయే పెద్దలు ఎవర్నది నేడు తేలే అవకాశం ఉంది. ఈ మేరకు ఆ పార్టీలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నెల 13వ తేదీతో నామినేషన్ దాఖలు గడువు ముగుస్తోంది. ఈ నెల 26వ తేదీన జరగబోయే రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లో ఏపీ నుంచి నలుగురుకి అవకాశం ఉంది. ఆ నలుగురు వైఎస్సార్‌సీపీ తరఫునే రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. తనను నమ్ముకున్న వారికి పెద్దపీట వేస్తారని పేరున్న జగన్.. ఆ కోవలోనే […]
జగన్ మరో సంచలనానికి తెరలేపబోతున్నట్టు కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రివర్గం విషయంలో అనూహ్యంగా స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి ఈసారి ఎలా స్పందిస్తారన్నది చర్చనీయాంశం అవుతోంది. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు విజయం సాధించి, బంపర్ మెజార్టీ సాధించిన తర్వాత తన క్యాబినెట్ సహచరుల ఎంపిక విషయంలో సీఎం తీరు ఆశ్చర్యకరంగా మారింది. అనేక మంది ఆశావాహులు, ముఖ్యంగా సీనియర్లను అసంతృప్తికి గురిచేసింది. అయినప్పటికీ ఆర్కే రోజా వంటి ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా తమ అసంతృప్తిని […]
ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ క్యాబినెట్ తీర్మానించి వేగంగా ఆ ప్రక్రియను ప్రారంభించింది. మంచి సలహాలు ఇస్తుందని ఏర్పాటు చేసుకున్న మండలిని రాజకీయాలకు వాడుకుంటున్నారనే కారణంతో క్యాబినేట్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ తీర్మానాన్ని అసెంబ్లీకి పంపింది. అయితే ఏపీ మండలి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థలో ఎగువసభగా గుర్తింపు పొందింది. విధాన పరిషత్తు 1958 నుండి 1985 మరియు 2007 నుండి ఇప్పటివరకూ రెండుసార్లు ఉమ్మడి రాష్ట్రంలో ఉంది. ప్రస్తుతం ఏపీలో […]
ఏపీలో శాసనమండలి చర్చనీయాంశం అవుతూనే ఉంది. ఇప్పటికే కీలక బిల్లుల విషయంలో కొర్రీలు వేసి చివరకు మండలి రద్దు వరకూ రావడానికి అక్కడి పరిణామాలు కారణం అయ్యాయి. అయితే రాష్ట్ర స్థాయిలో మండలికి సంబంధించిన ముగింపు ప్రక్రియ పూర్తయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉన్న వ్యవహారం ఎప్పటికి కొలిక్కి వస్తుందోననే క్లారిటీ ఇంకా రాలేదు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడత సందర్భంగా మండలి రద్దు తీర్మానం ఆమోదించే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. ఇటీవల మోడీ, […]