iDreamPost
android-app
ios-app

పవర్ స్టార్ 27లో సర్ప్రైజ్ యాక్టర్స్

  • Published Feb 27, 2020 | 1:08 PM Updated Updated Feb 27, 2020 | 1:08 PM
  • Published Feb 27, 2020 | 1:08 PMUpdated Feb 27, 2020 | 1:08 PM
పవర్ స్టార్ 27లో సర్ప్రైజ్ యాక్టర్స్

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరియు మొదటగా విడుదలయ్యేది పింక్ రీమేకే కానీ అందరి దృష్టి తర్వాత రాబోయే క్రిష్ మూవీ మీదే ఉంది. విభిన్నమైన కథలతో లిమిటెడ్ బడ్జెట్ తోనే రిచ్ మేకింగ్ తో మెప్పించే క్రిష్ ఇప్పుడు పవన్ తో పీరియాడిక్ డ్రామా చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రచారంలో ఉంది. తెలంగాణ యోధుడు పండగ సాయన్న కథని కూడా చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇందులో రెండు కీలక పాత్రలకు బాలీవుడ్ యాక్టర్స్ ని తీసుకున్నట్టు సమాచారం.

ఒకరు అర్జున్ రామ్ పాల్. హిందీలో వర్సటైల్ యాక్టర్ గా పేరున్న అర్జున్ రామ్ పాల్ హిందీ సినిమాల ద్వారా మనవాళ్లకూ సుపరిచితుడే. హీరోగా విలన్ గా విభిన్న పాత్రల ద్వారా ఎన్నో ప్రశంశలు అవార్డులు దక్కించుకున్నాడు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ ఓం శాంతి ఓంలో అర్జున్ రామ్ పాల్ పెర్ఫార్మన్స్ అందరిని ఆకట్టుకుంది. ఇందులో ఎలాంటి రోల్ ఆఫర్ చేశారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక రెండో యాక్టర్ జాక్వలిన్ ఫెర్నాండేజ్. సాహోలో ఒక స్పెషల్ సాంగ్ లో ఆడిపాడిన ఈ భామ అందులో గ్లామర్ షో ద్వారా ప్రేక్షకులకు బాగానే గేలం వేసింది.

ఇప్పుడు పవన్ మూవీలో ఎలాంటి పాత్ర ఆఫర్ చేశారో తెలియదు కానీ ఒక లీక్ ప్రకారం తనను బ్రిటిష్ సంతతికి చెందిన యువరాణిగా చూపబోతున్నట్టు తెలిసింది. ఇవన్నీ అధికారికంగా ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సాయి మాధవ్ బుర్ర సంభాషణలు ఆకర్షణగా నిలవబోతున్నాయి. వచ్చే ఏడాది విడుదల టార్గెట్ చేసిన ఈ సినిమాకు ఇప్పటి నుంచే బిజినెస్ ఆఫర్స్ వస్తున్నట్టు వినికిడి. ఏఎం రత్నం నిర్మాణం కాబట్టి ప్రొడక్షన్ లో ఎలాగూ కాంప్రోమైజ్ ఉండదు. ముందు ముందు ఈ సినిమా గురించి ఊరించే అప్డేట్స్ చాలా వచ్చేలా ఉన్నాయి. చూద్దాం.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom