iDreamPost
iDreamPost
పాన్ ఇండియా పేరుతో ప్రభాస్ కెరీర్లో చాలా విలువైన సంవత్సరాలు కర్పూరంలా కరిగిపోతున్నాయి. ఇప్పటికే బాహుబలి సాహోల కోసం ఐదేళ్లు ఖర్చు పెట్టిన డార్లింగ్ ఇప్పుడు షూటింగ్ లో ఉన్న సినిమా కోసం మరో రెండేళ్లు ఆగాల్సిందేనని అభిమానులకు ఇన్ డైరెక్ట్ గా మెసేజ్ ఇస్తున్నాడు. ఇది 2021 వేసవికి టార్గెట్ చేశారట. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కూడా సుమారు రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతుందని ఇప్పటికే టాక్ ఉంది.
ఎలాగూ ప్రభాస్ కు నేషనల్ లెవెల్ లో పెద్ద మార్కెట్ వచ్చింది కాబట్టి ఇకపై ప్రతి సినిమాను మాట్లీ లాంగ్వేజ్ గా తీర్చిదిద్దేలాగా ప్లానింగ్ జరుగుతోందట. ఈ లెక్కన డార్లింగ్ కోసం ఎక్కువ గ్యాప్ ని భరించక తప్పదు అభిమానులు. ఈ మధ్యలో ఏదైనా రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేసే ఆలోచన కూడా కనిపించడం లేదు. ప్రభాస్ లాంటి స్టార్లు హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా సినిమాకు మధ్య ఇంత టైం తీసుకోవడం భావ్యం కాదు. స్టార్ల ఆధారంగా నడిచే సౌత్ మార్కెట్ లో వ్యాపారం అధిక శాతం వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది.
ఎక్కువ సినిమాలు చేస్తే బాక్స్ ఆఫీస్ కళకళలాడటంతో పాటు ధియేటర్ల మీద మనుగడ సాగించే కొన్ని లక్షల కుటుంబాలకు ఉపయోగం ఉంటుంది. చిన్న లేదా మీడియం రేంజ్ సినిమాలు ఇంత ఫీడింగ్ తీసుకురాలేవు. అందులోనూ బిసి సెంటర్స్ లో వీటి రన్ అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రభాస్ వరస చూస్తేనేమో రెండేళ్ళకో సినిమా అంటే పాతిక మార్కు చేరుకోవడానికే ఇంకో ఐదారేళ్ళు పట్టేలా ఉంది. ఫ్యాన్స్ మాత్రం మిర్చి తరహాలో మధ్యలో మాస్ మసాలా సినిమాలు చేయమంటున్నారు కాని డార్లింగ్ కి ఉన్న డిమాండ్ అలా రాజీ పడడానికి ఒప్పుకోదుగా