iDreamPost
android-app
ios-app

రామ్ చరణ్ ముందు ఎన్నో ఆప్షన్స్

  • Published Mar 08, 2020 | 4:07 PM Updated Updated Mar 08, 2020 | 4:07 PM
రామ్ చరణ్ ముందు ఎన్నో ఆప్షన్స్

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జూలై నుంచి ఫ్రీ అయిపోతాడు. తర్వాత దాని ప్రమోషన్ లో పాల్గొనాల్సి ఉంటుంది కాని మరీ నెలల తరబడి అయితే అవసరం ఉండదు. అక్టోబర్ నుంచి పబ్లిసిటీ ఉదృతంగా జరిగేలా రాజమౌళి ప్లాన్ చేసుకున్నాడు. కాని దీని తర్వాత చరణ్ ఏ సినిమా చేస్తాడనే క్లారిటీ మాత్రం ఇప్పటిదాకా రాలేదు. సాహోతో భారీ బడ్జెట్ సినిమాను హ్యాండిల్ చేసిన సుజిత్ వైపు చరణ్ లుక్ వేస్తున్నాడన్న టాక్ ఉంది.

ప్రభాస్ ప్రత్యేకంగా రికమండ్ చేసి మరీ ఒక ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టు చెప్పమని సూచించాడట. అది ఇంకా కొలిక్కి రాలేదని సమాచారం. మరోవైపు ప్రవీణ్ అనే కొత్త దర్శకుడి లైన్ కూడా చరణ్ కు నచ్చిందని ఫుల్ స్క్రిప్ట్ కనక చిరు ఓకే చేస్తే కెరీర్ లో మొదటిసారి డెబ్యు డైరెక్టర్ తో చేసే ఛాన్స్ ఉందని ఫిలిం నగర్ టాక్. మరోవైపు ఆచార్య తర్వాత కొరటాల శివ చరణ్ తో చేసేందుకు ఓ లైన్ రెడీ చేసి ఉంచాడట. ఒకదశలో త్రివిక్రమ్ పేరు వినిపించింది కాని తను జూనియర్ ఎన్టీఆర్ కు లాక్ అయిపోయాడు కాబట్టి ఆ ఛాన్స్ లేనట్టే.

సుకుమార్ అల్లు అర్జున్ తో చేస్తున్నాడు కాబట్టి ఇంకో ఏడాది దాకా ఖాళీ లేనట్టే. వంశీ పైడిపల్లి విషయంలోనే ఇంకా ఎలాంటి స్పష్టత రావడం లేదు. ఎలాగూ చెర్రితో గతంలో ఎవడు లాంటి హిట్ మూవీకి వర్క్ చేసిన అనుభవం ఉంది కాబట్టి స్క్రిప్ట్ తో మెప్పిస్తే చరణ్ నో చెప్పే ఛాన్స్ ఉండదు. ఈ లెక్కన చూస్తే దారులు చాలా ఉన్నాయి కాని చరణ్ దేనిలో వెళ్తాడనే క్లారిటీ మాత్రం మిస్సవుతోంది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయ్యే నాటికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. ఇప్పటికే ఫాంలో ఉన్న దర్శకులు వేర్వేరు కమిట్మెంట్స్ తో బిజీ అయ్యారు. సో ఇంకో రెండు నెలల్లోనే అభిమానులకు చరణ్ గుడ్ న్యూస్ చెప్పాల్సిందే.

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş