గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ మహిళా ప్రిన్సిపాల్‌తో విద్యార్థిని కాళ్లకు దణ్ణం పెట్టించారు విద్యార్థి సంఘం నాయకులు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ పని చేయించిన ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘం తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఓ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని హాజరు తక్కువగా ఉంది. దీంతో గురువారం ( మే 12,2022) ఆర్ఎస్ఎస్ కు చెందిన ఏబీవీపీ నేత అక్షత్ జైస్వాల్, ఆ విద్యార్థినితోపాటు మరి కొందరిని తీసుకుని ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ […]
భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలని బీజేపీ యోచిస్తోందంటూ నిన్నమొన్నటి వరకు ప్రత్యర్థి పార్టీలు, బీజేపీ వ్యతిరేకులు కమలం పార్టీపై విమర్శలు చేసేవారు. విద్యను కాషాయీకరణ చేసేందుకు యత్నిస్తోందనే విమర్శలు బీజేపీ సర్కార్‌పై వెల్లువెత్తాయి. నిన్నటి వరకు బీజేపీపై దాని ప్రత్యర్థులు విమర్శలు చేయగా.. ఇప్పడు కమలం పార్టీ నేతలే ఆయా అంశాలపై స్పష్టంగా మాట్లాడుతుండడం విశేషం. హిజాబ్ వివాదం నేపథ్యంలో గత నెలలో కర్ణాటకలోని శివమొగ్గలో విద్యార్థులు కళాశాలలో జాతీయ జెండా బదులు కషాయ జెండాను ఎగురవేశారు. […]
వారణాసి రామ్ మాధవ్.. చాలామందికి ఈ పూర్తి పేరు వింటే ఎవరో కొత్త వ్యక్తి అని గుర్తుపట్టక పోయే ప్రమాదం ఉంది. ఆర్ఎస్ఎస్ రామ్ మాధవ్ లేదా బిజెపి రామ్ మాధవ్ అంటేనే టక్కున ఢిల్లీ స్థాయి నేతలు సైతం గుర్తుపడతారు. తన సంస్థ పేరును తర్వాత పార్టీ పేరును ఇంటి పేరుగా మార్చుకున్న రామ్ మాధవ్ శకం బిజెపిలో ఇక ముగిసిపోయి నట్లే అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వెంకయ్యనాయుడు తర్వాత బిజెపిలో కీలకమైన పార్టీ […]
ఒకప్పటి కాంగ్రెస్ నేత, రాజకీయ మేథావి, రాజమహేంద్రవరం లోక్‌సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ బీజేపీ నేతలకు లక్ష్యంగా మారారు. ప్రత్యక్ష రాజకీయాలను నుంచి తప్పుకున్న ఉండవల్లి అరుణ్‌కుమార్.. వివిధ అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతుంటారు. మంచి పనులు చేస్తే అభినందిస్తుంటారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుపై అయన ఎక్కువసార్లు మీడియా సమావేశాలు నిర్వహిస్తుంటారు. ఆ సమయంలోనే రాష్ట్ర, జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతుంటారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సవివరంగా సమాధానాలు చెబుతుంటారు. ఈ క్రమంలో […]
ఏపీలో శాసనమండలి వ్యవహారం ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారింది. కీలక బిల్లులను పదే పదే అడ్డుకుంటున్న నేపథ్యంలో ఎగువ సభను ఎత్తివేసే ప్రణాళికను ముందుకు తీసుకొచ్చారు. దానికి అనుగుణంగానే అసెంబ్లీ ఆమోదం వంటి తంతు ముగిసింది. కానీ బంతి కేంద్రం కోర్టులోకి వెళ్లిన తర్వాత ఏమవుతుందోననే ఉత్కంఠ అందరిలో కనిపిస్తోంది. కేంద్రం బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టకుండా జాప్యం చేస్తుందని విపక్షం ఆశిస్తుంటే, వీలయినంత త్వరగా ఆ ప్రక్రియను పూర్తి చేయించుకోవాలని పాలక వైఎస్సార్సీపీ ఆశిస్తోంది. రెండు శిబిరాలను […]
పవన్ కళ్యాణ్ సినిమాల గురించి చర్చ సాగుతోంది. జనసేన పేరుతో దాదాపు ఏడాదిన్నర పాటు షూటింగ్ లకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏకకాలంలో రెండు సినిమాలు ప్రారంభించారు. మరో రెండు సినిమాలకు ఆయన అంగీకరించారు. ఇక ముప్పైవ సినిమాగా మరోసారి త్రివిక్రమ్ తో జతగట్టే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ సినిమాల విషయంపై జనసేనలో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. చివరకు జేడీ లక్ష్మీనారాయణ తన రాజీనామా లేఖలో కూడా […]
ఆంధ్రప్రదేశ్ లో పాలనా వికేంద్రీకరణ నిర్ణయంతో మొదలయిన రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారంలో తాజాగా ఆర్ఎస్ఎస్ తలదూర్చింది. ఏకంగా ముఖ్యమంత్రిని తుగ్లక్, జగ్లక్ అంటూ సంబోధించడమే కాకుండా, ఈ పరిణామాలు బీజేపీ బలోపేతానికి దోహదం చేస్తాయని, కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆ సంస్థ అధికారిక పత్రికలో వచ్చిన కథనం కలకలం రేపుతోంది. రాజకీయాలకు సంబంధం లేదని లిఖితపూర్వకంగా చెప్పిన ఆర్ఎస్ఎస్ రాజకీయం పలువురిని విస్మయ పరుస్తోంది. ఏపీ అభివృద్ధి విషయంలో ఎన్నడూ పట్టని కాషాయ సంస్థకు […]
గత సంవత్సరంగా దేశంలో ఏ మూల ఎన్నికలు జరిగినా బీజేపీ తరుపున వినిపించే పేరు “సునీల్ డియొధర్”. బీజేపీ తరుపున విజయవంతమైన ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ డియొధర్ పేరు సంపాదించారు.గత వారం బి.జే.పి తో జనసేన పొత్తు కుదుర్చుకోవటంలో కీలక పాత్ర పోషించటంతో రాష్ట్రంలో కూడా సునీల్ డియొధర్ పై చర్చ నడుస్తుంది. 1985లో ఆర్.యస్.యస్ లో కార్యకర్తగా మొదలై 1991లో మేఘాలయకు ప్రచారక్ గా బాధ్యతలు చేపట్టిన సునీల్ డియొధర్ కి బలమైన ఆర్.యస్.యస్ భావజాలం […]
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన ఢిల్లీ పర్యటనను అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, తదితరులతో ఆయన సమావేశం అవుతారని వార్తలు వచ్చినా పవన్ ఇప్పటివరకూ అధికారికంగా ఎవరినీ కలవలేదు. పవన్ ఆదివారం పూర్తిగా తాను బస చేసిన హోటల్‌కే పరిమితమయ్యారని సమాచారం. అమిత్ షా మధ్యప్రదేశ్ పర్యటనతో పాటు డిల్లీ ఎన్నికల హడావుడిలో ఉన్నారు. మరోవైపు బీజేపీ అగ్రనేతలు డిల్లీ అభ్యర్థుల […]