iDreamPost
android-app
ios-app

CM రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ‘RSS రిజర్వేషన్స్ రద్దు చేయాలనే పట్టుదలతో ఉంది’

  • Published Apr 25, 2024 | 2:45 PM Updated Updated Apr 25, 2024 | 2:45 PM

Abolish Reservations: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా సీఎం రేవంత్‌ రెడ్డి రిజర్వేషన్లకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

Abolish Reservations: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా సీఎం రేవంత్‌ రెడ్డి రిజర్వేషన్లకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

  • Published Apr 25, 2024 | 2:45 PMUpdated Apr 25, 2024 | 2:45 PM
CM రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ‘RSS రిజర్వేషన్స్ రద్దు చేయాలనే పట్టుదలతో ఉంది’

కొన్ని రోజుల క్రితమే దేశంలో సార్వత్రిక ఎన్నికలకు నగరా మోగింది. ఇప్పటికే తొలి దశ ఎన్నికలు ముగిశాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. దాంతో అధికార, విపక్ష పార్టీలు ప్రచార జోరు పెంచాయి. నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణాన్ని హీటెక్కిస్తున్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా తన హవా కొనసాగించాలని భావిస్తోంది. ఇక సీఎం రేవంత్‌రెడ్డి సహా.. మిగతా నేతలంతా ప్రతిపక్ష పార్టీలైన బీఆర్‌ఎస్‌, బీజేపీలపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. రిజర్వేషన్లకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఆ వివరాలు..

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ.. తన పాలనా కాలంలో అనేక సంచలన నిర్ణయాలు తీసుకుని.. దేశ ప్రజలకు భారీ షాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సీఎం రేవంత్‌ రెడ్డి బీజేపీపై విమర్శలు చేస్తూ.. కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రారంభించి వచ్చే ఏడాదికి 100 ఏళ్లు పూర్తవుతుంది ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ రిజర్వేషన్లు రద్దు చేయాలనే పట్టుదలతో ఉంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. రేవంత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ నయవంచన పేరుతో ప్రజా ఛార్జ్‌షీట్‌ని ఆవిష్కరించింది కాంగ్రెస్‌ పార్టీ. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా.. కృష్ణా జలాల్లో వాటా వంటి పలు అంశాలను ఈ ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ విధానం.. రిజర్వేషన్ల రద్దుకు ఆ పార్టీ కుట్ర చేస్తోంది.. అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. ‘‘ఆర్‌ఎస్‌ఎస్‌ 1925లో ప్రారంభమైంది.. వందేళ్లలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలనేదే దాని ప్రధాన లక్ష్యం. ఆర్‌ఎస్‌ఎస్ ఆవిర్భవించి 2025కు వంద సంవత్సరాలు పూర్తవుతాయి. రిజర్వేషన్లను రద్దు చేయాలనే పట్టుదలతో ఆర్‌ఎస్‌ఎస్‌ ఉంది. ఈ ఎన్నికల్లో టూ బై థర్డ్‌ మెజార్టీ వస్తే.. రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు రద్దు చేస్తారు’’ అని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. అలా జరగకుండా ఉండాలంటే బీజేపీకి ఓటు వెయ్యొద్దంటూ సీఎం రేవంత్‌రెడ్డి జనాలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సంచనలంగా మారింది.