రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో మూడు రాజధానులు అని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటన చేశాక అమరావతి ప్రాంతంలో రైతులు కొందరు నిరసన దీక్షలు మొదలు పెట్టారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొందరు హర్షం వ్యక్తం చేశారు. అంతకు మించి ప్రజల్లో పెద్దగా స్పందన కనిపించలేదు. రాజధాని నగరం ఒక చోట ఉన్నా, మూడు చోట్ల ఉన్నా సగటు పౌరుడి జీవితంలో పెద్ద తేడా కనిపించదు కాబట్టి ఆ నిర్లిప్తత. అయితే తెలుగుదేశం శ్రేణులు, ముఖ్యంగా ఆ పార్టీ […]
ఏపీలో పరిస్థితి ఆసక్తిగా మారింది. అన్నీ రివర్స్ టెండరింగ్ అన్నట్టుగా పాలనా వ్యవహారాలు కూడా రివర్స్ లో నడుస్తున్నాయి. సహజంగా దర్యాప్తు జరపమని ప్రతిపక్షం అడుగుతుంటే పాలకపక్షం కాలయాపన చేస్తుంది. కానీ ఏపీలో దానికి భిన్నమైన అనుభవం ఇప్పటికే చూశాం. ఇప్పుడు ఎన్నికలు జరపాలని అధికార పార్టీ తహతహలాడుతుంటే, వాయిదా వేయించాలనే యత్నంలో ప్రధాన ప్రతిపక్షం ఉన్నట్టుగా కనిపిస్తోంది. దాంతో స్థానిక ఎన్నికల సమరం చర్చనీయాంశంగా మారింది. పోటీకి ముందే విపక్షం చేతులెత్తేస్తుందా అనే సందేహాలు కనిపిస్తున్నాయి. […]
“నీవు చెప్పేదానితో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ ఆ విషయం చెప్పడానికి నీకున్న హక్కుని కాపాడడానికి నీతో కలిసి పోరాటం చేస్తాను” అని మూడు శతాబ్ధాల క్రితం ఫ్రెంచ్ తత్వవేత్త వోల్టోయిర్ చెప్పిన మాటలు ప్రజాస్వామ్యానికి మూలస్థంభంలా ఉన్నాయి. అయితే చాలాసార్లు వ్యవస్థ కన్నా నాయకుల వ్యక్తిగత భావనలే బలమైనప్పుడు భావ వ్యక్తీకరణకు కూడా అడ్డుకట్టలు పడుతుంటాయి. విశాఖపట్నంలో తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు పర్యటనను ప్రభుత్వం అడ్డుకోవడం గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ పర్యటనకు వచ్చిన […]
మాజీ ముఖ్యమంత్రి సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనపై విశాఖపట్నంలో ప్రజాగ్రహం పెల్లుబికింది.. ఉత్తరాంధ్రలో ప్రజా చైతన్యయాత్ర చేసేందుకు గురువారం ఉదయం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబుకు విశాఖ ప్రజలనుండి తీవ్ర నిరసన సెగ తగిలింది. విశాఖను పరిపాలన రాజధాని చేయడాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబును ఉత్తరాంధ్రలో పర్యటించబోమని ప్రజలు, వైసీపీ కార్యకర్తలు, ప్రజా సంఘాల నేతలు పెద్దఎత్తున రోడ్డుపై చంద్రబాబు కాన్వాయ్ కు అడ్డంగా రోడ్డుపై ఆందోళనకు దిగారు.ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు చేసారు. […]
ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు విశాఖ, విజయనగరం పర్యటన జరగకపోవడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు అమితానందంతో ఉన్నాయి. అదీ చంద్రబాబు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి వెనుదిరగడంతో లెక్క సరిపోయిందని వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రత్యేక హోదా కోసం 2017 జనవరి 26వ తేదీన సీఎం జగన్ విశాఖలో ర్యాలీ నిర్వహించతలపెట్టారు. ఆ కార్యక్రమం కోసం జగన్ హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖ చేరుకున్నారు. అయితే ఎయిర్‌పోర్టు రన్‌వే మీదనే రాష్ట్ర పోలీసులు జగన్‌ను అడ్డుకున్నారు. అక్కడ నుంచి కనీసం లాంజి […]
టీడీపీ నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మూడు రాజధానులపై ప్రజా బ్యాలెట్ నిర్వహించి జగన్ చేస్తున్న అరాచకాన్ని ప్రజలకు వివరిస్తామని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌లు ప్రటించారు. నిన్న మొన్నటి వరకు మూడు రాజధానులపై రెఫరెండం నిర్వహించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. అయితే దాని విధి విధానాలేమిటో వెల్లడించలేదు. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఆ తర్వాత ఆ విషయాన్ని ఆయన పక్కబెట్టేశారని అందరూ అనుకున్నారు. […]
ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఈరోజు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జగన్ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులను చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో ఈ రోజు ఆయన పర్యటనను అడ్డుకుంటామని వైసిపి కార్యకర్తలు పిలుపునిచ్చిన నేపథ్యంలో చంద్రబాబు ని అడ్డుకొని ఆయనకు తమ నిరసనను తెలియజేయడానికి ఈ ఉదయమే వైసిపి కార్యకర్తలు, మూడురాజధానులకు అనుకూలంగా ఉన్న ప్రజలు, మహిళలు భారీగా ఎయిర్పోర్ట్ కి […]
విశాఖను వ్యతిరేకించి ఉత్తరాంధ్రలో యాత్రా ?? ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో ప్రజా చైతన్య యాత్ర చేస్తున్నారు. బస్సులో పలు ప్రాంతాలమీదుగా సాగుతూ ప్రజలతో ముచ్చటిస్తారు. కార్యకర్తలకు ఉత్తేజం కలిగిస్తారు. వాస్తవానికి ఆయన రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని క్యాడర్ ను నిలబెట్టుకునేందుకు,వారికి నైతిక మద్దతు తెలిపేందుకే వస్తున్నారు. కానీ బయటకు చెప్పేది మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చెప్పేందుకని, వారికి అండగా తానున్నానని చెప్పేందుకని అంటున్నారు. అయితే ఎన్నికల్లో […]
జగన్ పరిపాలన, నిర్ణయాలపై ప్రజలను చైతన్య వంతులను చేసేందుకంటూ ఇటీవల మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్ర పేరుతో యాత్రలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్టురులో ప్రారంభమైన ప్రజా చైతన్య యాత్ర.. ఒంగోలుకు చేరుకున్న తర్వాత కొంత విరామం తీసుకుంది. ఆ తర్వాత నిన్న, మొన్న తన సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రజా చైతన్య యాత్ర చంద్రబాబు చేశారు. ఈ యాత్రలో భాగంగా ఆయన రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. గంటల కొద్దీ ప్రసంగించిన […]
జగన్‌పై అనేక క్రిమినల్ కేసులున్నాయనే ట్రంప్ పర్యటనకు కేంద్రం పిలవలేదు. అమెరికా చట్టం చాలా నిక్కచ్ఛిగా ఉంటుంది. ఇలాంటి ఆర్థిక నేరగాళ్లను వాళ్లు చాలా దూరం పెడతారు, అందుకే ట్రంప్‌తో విందుకు కేంద్రం పిలవలేదు… ఇవీ నిన్న కుప్పం లో ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్న మాటలు. మోకాలికి బోడి గుండుకు ముడివేయడంలో చంద్రబాబుకు సాటిరాగల రాజకీయ నాయుడు భారత్ దేశంలో మరొకరు లేరనేది విశ్లేషకుల మాట. ఇది […]