iDreamPost
android-app
ios-app

స్నేహితుడి ఇంటికి చంద్రబాబు

స్నేహితుడి ఇంటికి చంద్రబాబు

ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తున్న చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. పర్యటనలో తన ఎస్వీ యూనివర్సిటీలో తనతో పాటు చదువుకున్న కాలేజీ స్నేహితుడు రత్నం ఇంటికి వెళ్లి స్నేహితుడిని పలకరించి ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన చంద్రబాబు కాలేజీ రోజులు గుర్తు చేసుకోగానే మనసుకు తెలియని ఉత్సహం వచ్చిందని తెలిపారు. స్నేహితుడి తండ్రి ఆశీర్వాదం తీసుకున్నానని, రత్నం తమ ఎంఏ బ్యాచ్ ఫోటోలు చూపించారని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

“ప్రజా చైతన్యయాత్రలో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని కంగుంది గ్రామానికి వెళ్ళి ఎస్వీ యూనివర్సిటీలో నా సహాధ్యాయి రత్నం కుటుంబాన్ని కలవడం జరిగింది. నా స్నేహితుడి తండ్రిగారు, 98 ఏళ్ళ పి.ఆర్. శ్యామ్ గారిని కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నాను

రత్నం తన దగ్గర ఉన్న యూనివర్సిటీలో మా బ్యాచ్ ఫోటోలను చూపించారు. ఒక్కసారిగా నా కాలేజీ రోజులు, ఆనాటి స్నేహాలు అన్నీ గుర్తొచ్చాయి. మనసుకు తెలియని ఉత్సాహం వచ్చిందని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు”

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom