పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చెవిన పడే ఉంటాయి. బాబు మాటలు ద్వారా నిమ్మగడ్డకు భవిష్యత్‌పై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసుంటుంది. బాబును నమ్మి తాను ఇలా ఎలా నడిచానా అన్న ఆంతర్మథనం నిమ్మగడ్డలో ప్రారంభమైయ్యే ఉంటుంది. అంతలా చంద్రబాబు.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ఉద్దేశించి మాట్లాడారు. మాచర్ల, పుంగనూరులో బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయంటూ «ధ్వజమెత్తిన చంద్రబాబు.. […]
పంచాయతీ ఎన్నికల తొలి విడత పోరు తుది దశకు చేరుకుంది. మరో 24 గంటల్లో పల్లె ఓటెత్తబోతోంది. రేపు ఉదయం 6:30 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాబోతోంది. విజయనగరం మినహా మిగతా 12 జిల్లాలో 3,249 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 525 పంచాయతీలు ఏకగ్రీవం కాగా. నెల్లూరు జిల్లాలోని ఓ పంచాయతీ సర్పంచ్, వార్డులకు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మిగతా 2,723 పంచాయతీలకు పోలింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. […]
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ వ్యవహారంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రిం కోర్టులో నేడు సోమవారం విచారణ జరగనుంది. ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ విడుదల చేసిన పంచాయతీ షెడ్యూల్‌పై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి స్టే విధించగా.. డివిజనల్ బెంచ్ నిమ్మగడ్డ నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో ఈ వ్యవహారం దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకు వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రిం […]
ఏపీలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ గురించి ప్రస్తుతం ఈ వ్యాఖ్యే సోషల్ మీడియాలో జోరుగా విన్పిస్తోంది. తన నియామకానికి మూలకారులకు కృతజ్ఞత తీర్చుకోవడానికే కావొచ్చే లేదా తన ‘వారి’ కోసం కృషి చేసే స్వభావం కావొచ్చు.. కారణం ఏదైనా గానీ ప్రజల ఓట్లతో గెల్చి సీయం అయిన జగన్ ప్రభుత్వంతో మాత్రం గొడవలే లక్ష్యంగా.. వివాదమే మార్గంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ […]
రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఇచ్చిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ఏపీ హైకోర్టు నిలిపివేయడంతో ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నారా..? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఈ రోజు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌తో బేటీ కావడం ఆయన ఎంత ఒత్తిడిలో ఉన్నారో స్పష్టమవుతోంది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును డివిజనల్ బెంచ్‌లో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సవాల్ […]
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ఊపందుకునేది. విమర్శలు, ప్రతివిమర్శలు, డబ్బుల పంపిణీలతో రాజకీయం వేడెక్కేది. అయితే పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం నిర్ణయించిన 59.85 శాతం రిజర్వేషన్లపై కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఎన్నికలపై స్టే ఇచ్చి, ఈ విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. పంచాయతీ ఎన్నికలకు వెళ్లే ధైర్యం ప్రభుత్వానికి లేకపోవడంతోనే రిజర్వేషన్లను పెంచి, కోర్టులో వైఎస్సార్సీపీ కేసు వేసిందని తెలుగుదేశం ఆరోపణలు చేస్తూ వస్తోంది. ప్రజల […]