మన దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు రాజకీయాలు కాస్త వైవిధ్యమనే చెప్పాలి. అక్కడ కింది స్థాయి అంచెలంచెలుగా ఎదిగి లేదా ఉద్యమాలతో క్రేజ్ తెచ్చుకొని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన వారు ఉన్నారు. అదే టైమ్లో సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీతో సీఎం కుర్చీని అధిరోహించిన వారూ ఉన్నారు. తమిళనాడులో సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. అక్కడ టాప్ స్టార్లుగా వెలుగొందే నటులు ఏదో ఒక పార్టీతో అనుబంధాన్ని కొనసాగించడం, వారికి మద్దతుగా నిలవడం ఎప్పటి […]
ఏదైనా అనుకున్నది సాధించాలంటే అన్నింటికీ ఎదురొడ్డి నిలవాల్సిందే . ఏటికి ఎదురీత అని ఎంతోమంది అనుకున్నా, నిలబడి ముందుకు సాగితేనే అనుకున్నది సాధించగలరు. ఈ విషయం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సిపి వ్యవస్థాపకుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో స్పష్టం అయింది. దశాబ్ద కాలం క్రితం పార్టీని స్థాపించి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని చివరకు విజయ తీరాలకు చేరిన నాయకుడిగా జగన్ నిలబడ్డారు. చరిత్రలోనే ప్రత్యేకతను సాధించారు. అప్పట్లో అంతా కాంగ్రెస్ హవా నడుస్తోంది. ఆ దశలో […]
India Today సర్వేలో వెల్లడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనతికాలంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయిలో ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో చోటు సంపాదించారు. 3650 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి, లక్షలాదిమంది ప్రజలతో మమేకమై 2019 ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన జగన్ ఆ పాదయాత్రలో తాను గమనించిన ప్రజల బాధలను రూపు మాపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ అవిశ్రాంత కృషి ఆయన్ను ఈ గుర్తింపు దరికి చేర్చింది. Read Also: జగన్ ని […]
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతున్నాయి..? వాటిని మరింత మెరుగుపరిచేందుకు ఏం చర్యలు తీసుకోవాలో ప్రజల నుంచే సూచనలు, సలహాలు తీసుకునేందుకు క్షేత్రస్థాయిలోకి వస్తున్నారు. వచ్చే నెల నుంచి రచ్చబండ తరహా కార్యక్రమం చేపట్టాలని వైఎస్ జగన్ నిర్ణయించినట్లు సమాచారం. Read Also: రాష్ట్ర వ్యాప్తంగా తహశీల్ధార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు… ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని, వారికి ఏమి కావాలో ఓ […]
రాత్రివరకు వెలగపూడి లోని అసెంబ్లీ వద్ద ధర్నాకు దిగిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు అక్కడినుండి రైతులకు సంఘీభావం తెలిపేందుకు పాదయాత్రగా మందడం వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో చంద్రబాబు, టీడీపీ నేతలను అదుపులోకి తీసుకుని తెలుగుదేశం పార్టీ కార్యలయం వైపు తరలించారు. అక్కడినుండి అర్ధరాత్రి 12గంటల సమయంలో మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ప్రజల కష్టసుఖాలను స్వయంగా తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన చరిత్రాత్మక ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసి నేటికి సరిగ్గా ఏడాది అవుతోంది. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి 2017 నవంబర్ 6వ తేదీన మొదలైన ప్రజా సంకల్ప యాత్ర గత ఏడాది జనవరి 9వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్లు, 134 నియోజకవర్గాలు, 231 మండలాలు, 54 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్లు, […]
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర సమయంలో కొంతమంది తల్లిదండ్రులు తమ కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో తమ పిల్లలను కూడా తమతో పాటు పనులకు తీసుకువెళ్లటం గమనించి వారి పిల్లలను పాఠశాలలకు పంపి చదివిస్తే ప్రతి కుటుంబానికి 15 వేల రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించిన సంగతి విదితమే. వైయస్సార్సీపి పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి “అమ్మ ఒడి” అనే పథకమును చదువుకునే విద్యార్థుల కోసం నూతనంగా ప్రారంభించారు.ఆంధ్రప్రదేశ్ లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు […]
ప్రతిపక్ష తెలుగుదేశం నేతలు తీవ్ర అసహనంతో ఉన్నట్టు కనిపిస్తోంది. అసెంబ్లీ గేటు వద్ద పార్టీ అధినేత చంద్రబాబు నడిపించిన ప్రహసనం ఇప్పటికే సభలో పెద్ద చర్చకు దారితీసింది. దానికి అనుగుణంగానే అధినేత బాటలో మిగిలిన నేతలు సాగుతున్నారు. తాజాగా ఏపీ టీడీపీ విభాగం అధ్యక్షుడిగా చెప్పుకునే కళా వెంకట్రావు కామెంట్స్ అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. సీఎం జగన్ ని ఉద్దేశించి విమర్శలు చేసే క్రమంలో ఆయన హద్దు మీరిన వ్యవహారం సామాన్య ప్రజానీకాన్ని కూడా విస్మయానికి గురిచేస్తోంది. […]