Idream media
Idream media
India Today సర్వేలో వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనతికాలంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయిలో ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో చోటు సంపాదించారు. 3650 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి, లక్షలాదిమంది ప్రజలతో మమేకమై 2019 ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన జగన్ ఆ పాదయాత్రలో తాను గమనించిన ప్రజల బాధలను రూపు మాపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ అవిశ్రాంత కృషి ఆయన్ను ఈ గుర్తింపు దరికి చేర్చింది.
Read Also: జగన్ ని అభినంధించిన మహరాష్ట్ర ముఖ్యమంత్రి…
ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరిట జాతీయ స్థాయిలో ఈ నెలలో నిర్వహించిన పోల్ సర్వేలో వైఎస్ జగన్ ‘బెస్ట్ పెర్‌ఫార్మింగ్ సీఎం’ల జాబితాలో నాలుగో స్థానాన్ని సాధించారు.
మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ (బీజేపీ), రెండో స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (ఏఏపీ), పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), మూడో స్థానంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ , నాలుగో స్థానం లోCM జగన్ ,అయిదో స్థానంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేమరియు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ,ఆరో స్థానంలో గుజరాత్ సీఎం విజయ్‌రూపాని, ఏడో స్థానంలో రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్ మరియు హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌లు నిలిచారు. రైతు భరోసా, అమ్మ ఒడి వంటి వినూత్న పథకాలు ప్రజలకు ఆయన్ను మరింత చేరువ చేసాయి.
Read Also: జగన్ కి జై అంటున్న సీనియర్ కాంగ్రెస్ నేత