తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టీ హబ్ ప్రారంభానికి ముస్తాబైంది. విద్యుత్ కాంతులతో భవనం జిగేల్ మంటోంది. ఆ ఫోటోను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో షేర్ చేశారు. నాలుగు వేలకు పైగా అంకురాలకు వసతి కల్పించేలా నిర్మితమైన ప్రపంచచంలో అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణంగా టీహబ్ నిలిచింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్ చేతులమీదుగా టీ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. హైదరాబాద్ రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో రూ.400 కోట్ల వ్యయంతో, మూడు […]
కొద్దిరోజులుగా బీజేపీ నేతలు.. హిందుత్వ, జాతీయవాద సినిమాలను ప్రోత్సహిస్తూ తమకు తాము బ్రాండ్లుగా చెప్పుకుంటున్నారు. ఇటీవల విడుదలైన ‘కశ్మీర్ ఫైల్స్’ మూవీని బీజేపీ ఓన్ చేసుకొని ఎంతగా ప్రచారం చేసుకుందో చూశాం.. ఇప్పుడు ‘శ్రీరాముడి’ని బేస్ చేసుకొని తీస్తున్న ‘ఆదిపురుష్’ మూవీని కూడా బీజేపీ అలానే వాడుకుంటోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో ప్రభాస్ శ్రీరాముడి పాత్ర పోషిస్తున్నారు. సాధారణంగా హీరో ప్రభాస్ వివాదాలకు దూరంగా ఉంటారు. కనీసం మాట్లాడడానికి కూడా తటపటాయిస్తాడు. […]
తండ్రి కేసీఆర్ రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నా.. తనకంటూ ప్రత్యేక శైలి ఏర్పరుచుకుని తెలంగాణ రాజకీయాల్లో గుర్తింపు పొందిన వ్యక్తి కల్వకంట్ల తారక రామారావు. అతనే కేటీఆర్. అటు విపక్షాల ఎత్తులను తిప్పికొడుతూ ఇటు మంత్రిగా రాష్ట్ర అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్నో ప్రశంసలు పొందుతున్నారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఐటీ మంత్రి అనిపించుకుంటున్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా పౌర సేవలను పరుగెట్టిస్తున్నారు. అందుకే ఆయన దేశంలోనే ఉత్తమ మంత్రిగా […]
తెలంగాణలో మరోమారు ప్రోటోకాల్ వివాదం తెరమీదికికొచ్చింది. హైదరాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ప్రోటోకాల్ పాటించలేదంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తపేటలో ఓ వాటర్ ట్యాంకు ప్రారంభోత్సవంలో మంత్రి కేటీర్ పాల్గొన్నారు. కాగా, ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీకి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. ఈ విషయంలో అధికార పార్టీ తీరును తప్పుబడుతూ రేవంత్ రెడ్డి ఆందోళనకు దిగారు. వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం సందర్భంగా కొత్తపేటలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. […]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య పొత్తుపై ఊహాగానాలకు తెరపడింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తు ఉండదని, ఒంటరిగానే 150 డివిజన్లలో పోటీ చేస్తామని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు. గత ఎన్నికల్లో పాత బస్తీలో టీఆర్ఎస్ ఐదు డివిజన్లలో గెలిచిందని, ఈ సారి ఆ ఐదు డివిజన్లతోపాటు మరో ఐదు డివిజన్లలోనూ గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. మేయర్ పీఠాన్ని ఈ సారి కూడా కైవసం […]