iDreamPost
android-app
ios-app

మంత్రి కేటీఆర్ ఫ్లయింగ్ కిస్.. నెట్టింట వైరల్​గా మారిన వీడియో!

  • Author singhj Published - 06:01 PM, Thu - 10 August 23
  • Author singhj Published - 06:01 PM, Thu - 10 August 23
మంత్రి కేటీఆర్ ఫ్లయింగ్ కిస్.. నెట్టింట వైరల్​గా మారిన వీడియో!

‘ఫ్లయింగ్ కిస్’.. ఈ మాట ఇప్పుడు దేశంలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటులో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటూ బీజేపీ నేతలు రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. అధికార పార్టీ సభ్యుల వైపు చూపిస్తూ.. అది కూడా ముఖ్యంగా కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ వైపే రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటూ నానా హంగామా చేశారు. లోక్​సభలో ఉన్న మహిళా ఎంపీలను రాహుల్ అగౌరవపర్చారని.. ఆయన మీద వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నాయకులు స్పీకర్​కు కంప్లయింట్ చేశారు. ప్రధాని మోడీని ఇంటి పేరుతో దూషించిన కేసులో దోషిగా తేలిన కారణంగా ఇప్పటికే ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయారు రాహుల్.

పరువు నష్టం కేసులో సుప్రీం కోర్టు స్టే విధించడంతో ఎట్టకేలకు రాహుల్ గాంధీ ఊపిరి పీల్చుకున్నారు. దాదాపుగా నాలుగు నెలల తర్వాత మళ్లీ ఆయన పార్లమెంటులోకి అడుగు పెట్టారు. ఈ సమయంలో లోక్​సభలో మహిళా ఎంపీలకు ఆయన ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటూ మరో కాంట్రవర్సీలో చిక్కుకోవడం గమనార్హం. ఈ విషయం దేశమంతా చర్చనీయాంశంగా మారింది. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాహుల్ కిస్ మ్యాటర్ తీవ్ర చర్చనీయాంశం కాగా.. ఇప్పుడు మరో పాపులర్ పొలిటీషియన్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. అది మరెవరో కాదు.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. రాహుల్ చట్టసభల్లో ఫ్లయింగ్ కిస్ ఇస్తే.. కేటీఆర్ మాత్రం విద్యార్థులకు ఇచ్చారు.

ఆగస్టు 8న జరిగిన వేములవాడ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఓ కార్యక్రమం ప్రభుత్వ స్కూలుకు పక్కనే జరిగింది. దీంతో పిల్లలంతా కేటీఆర్​ను కిటికీల్లో నుంచి చూసేందుకు పోటీపడ్డారు. మంత్రి వెళ్తున్నప్పుడు కొందరు స్టూడెంట్స్ ఆయన్ను పిలిచారు. దీంతో ఆ కిటికీల దగ్గరకు వచ్చిన కేటీఆర్.. చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. దీంతో పిల్లలు కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా మంత్రి అడిగిన ఓ ప్రశ్నకు.. ‘సార్, మేం మీ ఫ్యాన్స్’ అంటూ సమాధానం ఇచ్చాడో పిల్లాడు. దీనికి కేటీఆర్ కూడా ‘నేనూ మీ ఫ్యాన్​నే’ అని చెబుతూ చిన్నారులకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. విద్యార్థులకు మంత్రి ఫ్లయింగ్ కిస్ ఇస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişcasibom