iDreamPost
android-app
ios-app

రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్.. అప్పటి నుంచే కొత్త రేషన్ కార్డులు: మంత్రి KTR

రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డులపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డులపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్.. అప్పటి నుంచే కొత్త రేషన్ కార్డులు: మంత్రి KTR

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. రేషన్ కార్డు లేని వారికి ఊరటనిచ్చే విషయం చెప్పారు తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన కరీంనగర్ లో పాల్గొన్న ఓ రోడ్ షోలో రేషన్ కార్డుల జారీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత జనవరి నెలలో కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు లేని వారందరికి కొత్త కార్డులు ఇస్తామని ప్రకటించారు. రేషన్ కార్డులు లేక పలు ప్రభుత్వ పథకాలు పొందలేక పోతున్న వారికి భారీ ప్రయోజనం చేకూరనున్నది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా చొప్పదండి లో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్‌ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం ఇస్తామని తెలిపారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే 3 గంటలే కరెంట్‌ వస్తుంది. ఆ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం అంధకారమే అవుతుంది. కాబట్టి ప్రజలు విచక్షణతో ఆలోచించి సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని మంత్రి కేటీఆర్ ఓటర్లకు సూచించారు.

రైతులకు యాసంగి పెట్టుబడి సాయాన్ని సైతం అందిస్తున్నామని, నవంబర్ 28న రైతుల ఖాతాల్లో రైతుబందు నగదు జమఅవుతుందని వెల్లడించారు. ఇక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గులాబీ బాస్ కేసీఆర్ నియోజక వర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఓటర్లను చైతన్యపరుస్తూ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. కాగా ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరుగనుంది. ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 3న వెల్లడించనున్నారు. ఇప్పటికే ఎన్నికల అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో మునిగిపోయారు.