నాగ శౌర్య కొత్త సినిమాలు రెండు వరుడు కావలెను, లక్ష్యలు ఒకేరోజు ఓటిటిలోకి రాబోతున్నాయి. మొదటిది జీ 5, రెండోది ఆహా ద్వారా జనవరి 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇది ప్లాన్ ప్రకారం చేసుకున్నది కాకపోయినా వరుడు కావలెను మాత్రం డిజిటల్ లోకి రావడానికి ఎక్కువ సమయం తీసుకుంది. లక్ష్య నెలలోపే ఓటిటి ప్రేక్షకులను పలకరిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయిన ఈ సినిమాలు ఓటిటి స్పేస్ లో మంచి స్పందన దక్కించుకుంటాయనే నమ్మకం […]
ఛలో బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత చెప్పుకోదగ్గ కౌంట్ లో సినిమాలు చేసినప్పటికీ విజయం అందని ద్రాక్షగా మారిపోయిన హీరో నాగ శౌర్య కొత్త సినిమా లక్ష్య ఇవాళ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుబ్రమణ్యపురంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంతోష్ జాగర్లపూడి రెండో చిత్రమిది. లాక్ డౌన్ వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా కోసం శౌర్య చాలా కష్టపడ్డాడు. ప్రత్యేకంగా సిక్స్ ప్యాక్ చేసి ఒళ్లును హూనం చేసుకున్న పిక్స్ సోషల్ […]
నిన్న ఎన్ని సినిమాలు రిలీజైనా అందరి కళ్ళు ఉన్నది మాత్రం వరుడు కావలెను, రొమాంటిక్ ల మీదే. రెండు ఒకదానికొకటి సంబంధం లేని చిత్రాలు కావడంతో నిర్మాతలు ఎవరికి వారు వసూళ్ల మీద ధీమాగా ఉన్నారు. థియేట్రికల్ బిజినెస్ చాలా రీజనబుల్ గా జరగడంతో బ్రేక్ ఈవెన్ కావడం అంత కష్టమేమి అనిపించలేదు. కాకపోతే మినిమమ్ టాక్ అవసరమైన నేపథ్యంలో రెండింటిలో దేనికీ యునానిమస్ గా సూపర్ హిట్ రిపోర్ట్స్ రాలేదు. ఉన్నంతలో ఓ వర్గం నుంచి […]
నిన్న వరుడు కావలెనుతో పాటు విడుదలైన ఆకాష్ పూరి రొమాంటిక్ కి గత పది రోజులుగా ఏ రేంజ్ లో ప్రమోషన్లు చేశారో చూశాం. ఏకంగా ప్రభాస్ తో వీడియో ఇంటర్వ్యూలు చేయించి మరీ బజ్ తీసుకొచ్చారు. పూరి జగన్నాధ్ రచనలో ఆయన శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహించిన ఈ యూత్ ఎంటర్ టైనర్ లో కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. విపరీతమైన జాప్యం వల్ల మొదట్లో పెద్దగా అంచనాలు లేకపోయినా క్రమంగా ఓ […]
ఈ నెల 29న విడుదల కాబోతున్న ఆకాష్ పూరి రొమాంటిక్ మీద మెల్లగా అంచనాలు మొదలయ్యాయి. దీన్ని ఎలాగైనా క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో టీమ్ కూడా ప్రమోషన్ల వేగం పెంచింది. ట్రైలర్ కట్ యూత్ ని ఆకట్టుకోగా తాజాగా రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేయాలని పూరి నిర్ణయించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అనిల్ పాదూరి దర్శకత్వం వహించిన ఈ లవ్ కం యాక్షన్ ఎంటర్ టైనర్ ని ఎడిటింగ్ రూమ్ లో చూసి పూరి […]
ఈ వారం పెద్దగా సినిమాలు లేవు కానీ 29న మరోసారి మంచి బాక్సాఫీస్ పోటీ కనిపించనుంది. నాగ శౌర్య వరుడు కావలెనుతో పాటు ఆకాష్ పూరి రొమాంటిక్ విడుదల కానున్నాయి. నిన్నే రొమాంటిక్ ట్రైలర్ ని ప్రభాస్ తో గ్రాండ్ గా రిలీజ్ చేయించాడు పూరి. చూడగానే ఆహా ఓహో అనిపించలేదు కానీ యూత్ కి ఓ మోస్తరుగా కనెక్ట్ అయ్యే కొన్ని అంశాలు మాత్రం కనిపించాయి. కాకపోతే ఇడియట్ తో మొదలుపెట్టి నేను నా రాక్షసి […]