iDreamPost
android-app
ios-app

ఈ చిన్నది.. టాలీవుడ్ టాలెంట్ యాక్ట్రెస్.. మెగా హీరోలతో నటించింది

  • Published Sep 21, 2024 | 9:20 PM Updated Updated Sep 21, 2024 | 9:20 PM

ఈ చిన్నది.. టాలీవుడ్ టాలెంట్ యాక్ట్రెస్. మెగా కౌంపౌండ్ లో ముగ్గురు హీరోలతో నటించింది. టాలెంటరే కానీ.. కలిసి రావడం లేదు అంతే. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం.

ఈ చిన్నది.. టాలీవుడ్ టాలెంట్ యాక్ట్రెస్. మెగా కౌంపౌండ్ లో ముగ్గురు హీరోలతో నటించింది. టాలెంటరే కానీ.. కలిసి రావడం లేదు అంతే. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం.

  • Published Sep 21, 2024 | 9:20 PMUpdated Sep 21, 2024 | 9:20 PM
ఈ చిన్నది.. టాలీవుడ్ టాలెంట్ యాక్ట్రెస్.. మెగా హీరోలతో నటించింది

ఇండస్ట్రీలో హీరోయిన్‌గా తెరంగేట్రం చేయాలంటే ఫోటోలు పట్టుకుని స్టూడియోలు, దర్శక, నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరగనక్కర్లేదు. కేవలం సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెంచుకుంటే చాలు. తమ అందచందాలతో గ్లామరస్ ఫోటోలతో షూట్స్, రీల్స్, షాట్స్ చేస్తూ ఐడెంటిటీని సంపాదించుకోవడంతో పాటు.. నటిగా మారిపోవచ్చు. ఏ పిక్ లేదా వీడియో వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. ఒక్కసారి క్లిక్ అయ్యి.. ఏ దర్శకుడు, నిర్మాత దృష్టిలో పడితే.. ఇక నక్క తోక తొక్కినట్లే. ఇదిగో ఈ ఫోటోలో చిన్నది కూడా అలానే ఇండస్ట్రీలోకి వచ్చింది. గతంలో టిక్ టాక్ వీడియోలు చేసి నెట్టింట్లో హల్ చేసిన ఆమె.. హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఫస్ట్ సినిమాతోనే డార్లింగ్ ప్రభాస్‌తోనే టచ్‌లోకి వచ్చేసింది. మెగా కౌంపౌండ్‌లో ముగ్గురు హీరోలతో నటించింది. చిన్నప్పుడే హోయలొలికిస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు టాలీవుడ్ ముద్దుగుమ్మ కేతిక శర్మ.

ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ఢిల్లీ డాల్.. చేసినవీ నాలుగు సినిమాలే అయినా.. పిచ్చెక్కించే అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. తొలి చిత్రంతోనే గ్లామరస్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకుంది కేతిక. ఆమె డబ్ స్మాష్ వీడియో ఒక్కసారిగా క్లిక్ కావడంతో టాలీవుడ్ వాకిట్లోకి వచ్చి పడింది. పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ నటించిన రొమాంటిక్ చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ప్రమోషన్లలో గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ పాల్గొనడం గమనార్హం. ఈ ఇద్దరిని ఇంటర్వ్యూ చేసి సినిమాను సపోర్ట్ చేయాలంటూ కోరారు డార్లింగ్. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. ఆమెకు మాత్రం అవకాశాలు వచ్చాయి. నాగ శౌర్యతో వచ్చిన లక్ష్య మూవీ కూడా బెడిసికొట్టింది. కానీ తన ప్రయత్నాలు ఆగలేదు.

తర్వాత మెగా కాంపౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన రంగ రంగ వైభవంగా చిత్రంలో నటించింది ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఇది కూడా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి తేజ్ హీరోలుగా వచ్చిన బ్రో మూవీలో నటించింది. సాయి తేజ్ ప్రియురాలిగా ఆకట్టుకుంది. ఇక అప్పటి నుండి ఎటువంటి అప్ డేట్ లేదు. కొత్త సినిమా కబుర్లు చెప్పడం లేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. తన హాట్ అండ్ క్యూట్ ఫోటోలతో కాక రేపుతోంది ఈ ఢిల్లీ భామ. టాలెంట్ ఉంది కానీ కలిసి రావడం లేదు అంతే.  మరీ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి తీపి కబురు ఎప్పుడో చెబుతుందో.. ఆమె అభిమానులకు ఎప్పుడు కనువిందు చేస్తుందో చూడాలి. ఒక్క హిట్టు పడితే చాలు.. మళ్లీ దూసుకెళ్లడం ఖాయం.. ఏమంటారు..?

 

View this post on Instagram

 

A post shared by Ketika (@ketikasharma)

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet giriş