ఈ వారం అతి పెద్ద రిలీజ్ వరుణ్ తేజ్ గని ఒకటే. భారీ బడ్జెట్ తోనే నిర్మించారు కానీ ఎందుకో ఈ మెగా మూవీకి ఆశించిన బజ్ రావడం లేదు. ఆర్ఆర్ఆర్ తాకిడి బాక్సాఫీస్ వద్ద ఇంకా బలంగానే ఉంది. తగ్గించిన రేట్లు ఇవాళ్టి నుంచి అమలులోకి రానుండటంతో కలెక్షన్లు మళ్ళీ పెరుగుతాయనే నమ్మకం ట్రేడ్ లో ఉంది. 14న కెజిఎఫ్ 2 వచ్చేలోగా వీలైనంత రాబట్టుకోవాలనేది డిస్ట్రిబ్యూటర్ల ఆలోచన. ఈ నేపథ్యంలో థియేటర్ కౌంట్ ఎక్కువగానే […]
ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ వరుణ్ తేజ్ గనికి సరైన రిలీజ్ టైం సెట్ కాలేక వాయిదాల మీద వాయిదా పడుతూ ఎట్టకేలకు ఏప్రిల్ 8న వస్తున్న సంగతి తెలిసిందే. ఇంకో పద్దెనిమిది రోజులు ఉంది కాబట్టి యూనిట్ ఆర్ఆర్ఆర్ విడుదల తర్వాత ప్రమోషన్లు మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు. ఇటీవలే వచ్చిన ట్రైలర్ కి ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ బాగానే వచ్చింది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాలో చాలా గ్యాప్ […]
ఇప్పటికే రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన వరుణ్ తేజ్ గని కొత్త రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుంది. ఏప్రిల్ 8న థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అంటే ఆర్ఆర్ఆర్ వచ్చిన సరిగ్గా రెండు వారాలకు ప్లాన్ చేసుకున్నారన్న మాట. ఇది మంచి నిర్ణయం. ఎందుకంటే ట్రిపులార్ మీద ఉన్న హైప్ కి ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కనక కనీసం రెండు వారాల పాటు జనం దీనివైపే […]
భీమ్లా నాయక్ విడుదల తేదీ ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకులతో మొదలుకుని ట్రేడ్ సర్కిల్స్ దాకా దీని గురించి తప్ప మరో డిస్కషన్ జరగడం లేదు. అజిత్ వలిమై ఒక రోజు ముందు వస్తున్నప్పటికీ తెలుగులో దాని ఊసే లేదు. అంతగా పవన్ మేనియా కమ్మేసుకుంటోంది. శర్వానంద్ ఆడవాళ్ళూ మీకు జోహార్లు ప్రస్తుతానికైతే క్లాష్ కు సిద్ధపడే ఉంది. చివరి నిమిషంలో ఏమైనా మార్పులు జరుగుతాయేమో చూడాలి. ఇప్పుడు అందరి దృష్టి గని మీద ఉంది. స్వంత బాబాయ్ […]
ఈ నెల 25న కన్ఫర్మ్ వస్తుందని నమ్ముతున్న భీమ్లా నాయక్ రేస్ నుంచి తప్పుకున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. దాని స్థానంలో వరుణ్ తేజ్ గనిని అఫీషియల్ గా లాక్ చేశారు. ఇందాకే కొత్త పోస్టర్ తో అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఏపిలో నైట్ కర్ఫ్యూ తీసేసినా సగం సీట్ల ఆక్యుపెన్సీ ఇంకా కొనసాగుతోంది. ఎప్పటి నుంచి ఎత్తేస్తారనే క్లారిటీ ఇంకా రాలేదు. దానికి సంబంధించి ఈ రోజు ఏదైనా ప్రకటన లేదా జిఓ వచ్చి ఉంటే […]
వచ్చే నెల 24న నాని శ్యామ్ సింగ్ రాయ్ తో తలపడేందుకు సిద్ధమైన వరుణ్ తేజ్ గని రేస్ నుంచి తప్పుకున్నట్టు ఫ్రెష్ అప్ డేట్. అఫీషియల్ గా చెప్పలేదు కానీ రేపో ఎల్లుండో ప్రకటించే అవకాశం ఉందని మెగా కాంపౌండ్ టాక్. ఆ డేట్ ని చాలా అడ్వాన్స్ గా లాక్ చేసుకుంది నాని టీమే. హఠాత్తుగా గని వచ్చి పడింది. ఇది కూడా డిసెంబర్ మొదటి రెండు వారాల్లో రావాలని ప్లాన్ చేసుకున్నదే. బాలయ్య […]
నిన్న వరుణ్ తేజ్ గని టీజర్ లో విడుదల తేదీని డిసెంబర్ 24కి మారుస్తూ ఇచ్చిన ప్రకటన శ్యామ్ సింగ రాయ్ టీమ్ ని ఇబ్బందిలో పడేసింది. వారం ముందు పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమా ఉన్నా సోలో వస్తున్నాం కదా కంటెంట్ తో కొడదాం అనుకున్న నాని బృందానికి ఇది ఒకరకంగా షాకే. ఒకే రోజు రెండు రాకూడదని కాదు. కానీ సంక్రాంతి అంత స్కోప్ క్రిస్మస్ కు ఉండదు. పైగా రెండూ అటుఇటుగా […]