iDreamPost
android-app
ios-app

Ghani : న్యాచురల్ స్టార్ తో మెగా ప్రిన్స్ క్లాష్ ఎందుకొచ్చింది

  • Published Nov 16, 2021 | 6:26 AM Updated Updated Nov 16, 2021 | 6:26 AM
Ghani : న్యాచురల్ స్టార్ తో మెగా ప్రిన్స్ క్లాష్ ఎందుకొచ్చింది

నిన్న వరుణ్ తేజ్ గని టీజర్ లో విడుదల తేదీని డిసెంబర్ 24కి మారుస్తూ ఇచ్చిన ప్రకటన శ్యామ్ సింగ రాయ్ టీమ్ ని ఇబ్బందిలో పడేసింది. వారం ముందు పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమా ఉన్నా సోలో వస్తున్నాం కదా కంటెంట్ తో కొడదాం అనుకున్న నాని బృందానికి ఇది ఒకరకంగా షాకే. ఒకే రోజు రెండు రాకూడదని కాదు. కానీ సంక్రాంతి అంత స్కోప్ క్రిస్మస్ కు ఉండదు. పైగా రెండూ అటుఇటుగా సేమ్ రేంజ్ సినిమాలు. నాని వరుణ్ కెరీర్లలో ఇప్పటిదాకా హయ్యెస్ట్ బడ్జెట్ పెట్టినవి. సీనియారిటీ ప్రకారం న్యాచురల్ స్టార్ కే ఎక్కువ మార్కెట్ ఉన్నప్పటికీ మెగా అందండలు పుష్కలంగా ఉన్న గనిని తక్కువ అంచనా వేయడానికి లేదు.

ఫిలిం నగర్ టాక్ ప్రకారం గని కోసం శ్యాం సింగ రాయ్ డేట్ ని మార్పించేందుకు నిర్మాత అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నారన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. గతంలో దసరాకు వరుడు కావలెను ఫిక్స్ చేసినప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కోసం నాగ శౌర్య టీమ్ పక్కకు తప్పుకుని ఆ నెలాఖరుకు వచ్చింది. ఫలితం ఏమైందో చూశాం. అఖండ కోసం గనిని అరవిందే మార్పించారని కూడా అంటున్నారు. మరి అలాంటప్పుడు ముందే అనౌన్స్ చేసిన నానికి న్యాయం జరగాలి కదా. ఒకవేళ చేంజ్ చేద్దామన్నా డిసెంబర్ మొత్తం ఆల్రెడీ లాక్ అయిపోయింది. జనవరి గురించి ఆలోచించకపోవడం మంచిది. ఫిబ్రవరిలో ఆచార్య, ఖిలాడీ, ఎఫ్3లు ఉన్నాయి

సో శ్యామ్ సింగ రాయ్ క్లాష్ కు సిద్ధపడటం తప్ప వేరే ఆప్షన్ లేనట్టే. ఉన్న ఒక్క డేట్ డిసెంబర్ 10. ఆ రోజు పెద్దగా చెప్పుకునే సినిమాలు లేవు. కానీ వారం గ్యాప్ లో పుష్ప వచ్చేస్తుంది కాబట్టి థియేటర్ల సమస్య రావొచ్చు. రాను రాను ఇలాంటి బాక్సాఫీస్ యుద్ధాలు సాధారణం అయ్యేలా ఉన్నాయి. సంక్రాంతికి ఏ రేంజ్ లో కాంపిటీషన్ ఉందో చూస్తున్నాం. ఓపెనింగ్స్ మీద ప్రభావం ఉంటుందని తెలిసినా కూడా పరస్పరం తలపడటానికే ఇష్టపడుతున్నారు నిర్మాతలు. ఓటిటి, డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ తదితర హక్కుల రూపంలో ప్రొడ్యూసర్ సేఫ్ అవుతున్నాడు కానీ ఎటొచ్చి ఇలాంటి క్లాష్ ల వల్ల ఇబ్బంది పడేది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లే

Also Read : Bheemla Nayak : పాన్ ఇండియా సినిమాలతో పవన్ ఢీ