iDreamPost
android-app
ios-app

వరుణ్ తేజ్ మూవీకి అన్ని కోట్లా

  • Published Jul 06, 2021 | 6:49 AM Updated Updated Jul 06, 2021 | 6:49 AM
వరుణ్ తేజ్ మూవీకి అన్ని కోట్లా

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న గని బాలన్స్ షూటింగ్ పూర్తి చేసుకునేందుకు పరుగులు పెడుతోంది. విడుదల విషయంలో క్లారిటీ లేనప్పటికీ ముందైతే షూట్ పూర్తి చేసి ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకున్నాక ఆపై పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోబోతున్నారు. సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా పరిచయమవుతున్న గని బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. కీలకమైన పాత్రలను ఉపేంద్ర, రమ్యకృష్ణ చేస్తుండగా సునీల్ శెట్టి కూడా ఇందులో భాగమయ్యారు. ఈ సినిమా కోసమే వరుణ్ తేజ్ ప్రత్యేకంగా బాడీ మేకోవర్ మీద దృష్టి పెట్టి మరీ కష్టపడ్డాడు. ఇప్పుడు ఎఫ్3తో పాటు గనిని కూడా ఏకకాలంలో ఫినిష్ చేసేందుకు రంగంలోకి దిగాడు.

ఇక ఈ సినిమా డిజిటల్ ప్లస్ శాటిలైట్ హక్కులను ఆహా 24 కోట్లకు కొనేసిందన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికిది చాలా పెద్ద మొత్తం. అయితే గని నిర్మాతల్లో ఒకరైన అల్లు వెంకటేష్ స్వయానా ఆహా ఓనర్ అల్లు అరవింద్ పెద్దబ్బాయి కావడం, ఈ మూవీ తాలూకు నిర్మాణ వ్యవహారాలన్నీ అల్లు టీమ్ సారధ్యంలో జరగడం లాంటివి ఇలా జరగడానికి ఊతమిచ్చాయన్న కామెంట్ లో నిజం లేకపోలేదు. అయితే ఆహాకు స్వంతంగా శాటిలైట్ చానెల్ లేదు కాబట్టి ఆ హక్కులను వేరే వాళ్లకు అమ్ముకోవచ్చు. ఒకవేళ అక్కడ డీల్ లాభాసాటిగా ఉంటే ఆహాకు లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

థియేటర్లు తెరిచే సంగతి ఎలా ఉన్నా ఇలా అంతర్గతంగా డీల్స్ ఒక్కొక్కటిగా పెద్ద సినిమాలన్నీ చేసుకుంటున్నాయి. గని కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అయ్యింది. అయితే థియేట్రికల్ రైట్స్ ని ఎంతకు ఇవ్వబోతున్నారనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఎలా చూసుకున్నా కూడా రిలీజ్ కు ముందే గని చాలా సేఫ్ అయ్యాడు. అంచనాలు కూడా భారీగా ఉన్నాయి కాబట్టి కంటెంట్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటే మాత్రం కలెక్షన్లకు లోటు ఉండదు. కిరణ్ కొర్రపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తున్న ఈ సినిమా విజయ్ దేవరకొండ లైగర్ తో కాన్సెప్ట్ పరంగా పోటీ పడబోతోందని ఇప్పటికే టాక్ ఉంది. రిలీజయ్యాక కానీ క్లారిటీ రాదు.