iDreamPost
android-app
ios-app

Ghani : బాబాయ్ కోసం వెనక్కు వెళ్ళక తప్పదు

  • Published Feb 18, 2022 | 5:39 AM Updated Updated Feb 18, 2022 | 5:39 AM
Ghani : బాబాయ్ కోసం వెనక్కు వెళ్ళక తప్పదు

భీమ్లా నాయక్ విడుదల తేదీ ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకులతో మొదలుకుని ట్రేడ్ సర్కిల్స్ దాకా దీని గురించి తప్ప మరో డిస్కషన్ జరగడం లేదు. అజిత్ వలిమై ఒక రోజు ముందు వస్తున్నప్పటికీ తెలుగులో దాని ఊసే లేదు. అంతగా పవన్ మేనియా కమ్మేసుకుంటోంది. శర్వానంద్ ఆడవాళ్ళూ మీకు జోహార్లు ప్రస్తుతానికైతే క్లాష్ కు సిద్ధపడే ఉంది. చివరి నిమిషంలో ఏమైనా మార్పులు జరుగుతాయేమో చూడాలి. ఇప్పుడు అందరి దృష్టి గని మీద ఉంది. స్వంత బాబాయ్ తో ఢీ కొట్టేందుకు వరుణ్ తేజ్ ససేమిరా అనొచ్చు. పైగా అది గీత ఆర్ట్స్ సమర్పణలో బన్నీ అన్నయ్య బాబీ నిర్మాతగా మొదటి మూవీ. సో లేనిపోని రిస్క్ తీసుకోకపోవచ్చు

ఈ నేపథ్యంలో గనిని మార్చి 4కి పోస్ట్ పోన్ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. ఇవాళో రేపో అధికారికంగా ప్రకటించబోతున్నట్టు అంతర్గత వర్గాల సమాచారం. రెండు మెగా సినిమాలు ఒకే రోజు రావడం అటు మెగా కాంపౌండ్ కు కానీ ఇటు అల్లు వర్గానికి కానీ ససేమిరా ఇష్టం లేదన్నట్టు వినికిడి. ఒకవేళ సాహసం చేసి రిలీజ్ కు సిద్ధపడిన ఫ్యాన్స్ లో తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది. కనక ఇవన్నీ విశ్లేషించే గని డ్రాప్ అవ్వాలని డిసైడ్ అయ్యాడట. ఒకవేళ నిజంగా వచ్చినా కూడా మాస్ మసాలా భీమ్లా నాయక్ తాకిడిని తట్టుకోవడం బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన గనికి అదంత సులభం కాదు. అందుకే మారడమే బెటర్.

కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన గని ఈ కారణంగా ప్రమోషన్లను సడన్ గా ఆపేసినట్టు కనిపిస్తోంది. న్యాయంగా చూస్తే ముందు ప్రకటించింది వీళ్ళే అయినా పవన్ నిర్ణయానికి తలొగ్గని పరిస్థితి వచ్చింది. ఏ రకంగా చూసుకున్నా మార్చి 4 బెస్ట్ డేట్ అవుతుంది. కాకపోతే 10కి సూర్య ఈటి, 11న రాధే శ్యామ్ ఉన్నాయి కాబట్టి కేవలం వారం రోజులు మాత్రమే రన్ ఉంటుంది. అంతలోపు బ్రేక్ ఈవెన్ చేరుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇలా వద్దనుకుంటే ఇంకో నెలకు పైగానే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మార్చి 25న ఆర్ఆర్ఆర్ వస్తుంది. ఆపై ఏప్రిల్ లో వరసబెట్టి క్రేజీ సినిమాలు క్యూలో ఉన్నాయి. సో గనికి పెద్దగా ఆప్షన్లు లేవు

Also Read : OTT Competition : OTT సినిమాలు వెబ్ సిరీస్ తో ఓటిటిల పోటీ