iDreamPost
android-app
ios-app

అదుర్స్ మూవీ విలన్ గుర్తున్నాడా..? ఆయన కూతురు ఇప్పుడు స్టార్ హీరోయిన్..!

వివి వినాయక్-తారక్ కాంబోలో వచ్చిన మూవీ అదుర్స్. 2010లో వచ్చిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. కాగా, ఇందులో మ్యాన్ ఆఫ్ ది మాసెస్ డ్యూయల్ రోల్ పోషించాడు. ఇందులో విలన్ పాత్రలో మెప్పించిన నటుడు గుర్తున్నాడా..? ఆయన కూతురు ఇప్పుడో స్టార్ హీరోయిన్.. తెలుగులో కూడా చేసింది.

వివి వినాయక్-తారక్ కాంబోలో వచ్చిన మూవీ అదుర్స్. 2010లో వచ్చిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. కాగా, ఇందులో మ్యాన్ ఆఫ్ ది మాసెస్ డ్యూయల్ రోల్ పోషించాడు. ఇందులో విలన్ పాత్రలో మెప్పించిన నటుడు గుర్తున్నాడా..? ఆయన కూతురు ఇప్పుడో స్టార్ హీరోయిన్.. తెలుగులో కూడా చేసింది.

అదుర్స్ మూవీ విలన్ గుర్తున్నాడా..? ఆయన కూతురు ఇప్పుడు స్టార్ హీరోయిన్..!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ అదుర్స్. 2010లో వచ్చిన మూవీ బ్లాక్ బస్టర్ అందుకుంది. తారక్ డ్యూయల్ రోల్‌లో నటించిన సంగతి విదితమే. నరసింహ,చారీ పాత్రలో మెస్మరైజ్ చేశాడు. రూ. 26 కోట్లతో మూవీని తెరకెక్కించగా.. సుమారు రూ. 50 కోట్లను వసూలు చేసింది. కోన వెంకట్ కథ అందించగా. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ నిర్మించాడు. నయనతార, షీలా ఈ సినిమాకు గ్లామర్ అద్దారు. వీరితో పాటు మహేష్ మంజ్రేకర్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, నాజర్, తనికెళ్ల భరణి, రాజ్యలక్ష్మీ, రమా ప్రభ, సుధ, పృధ్వీరాజ్, ఎంఎస్ నారాయణ, రాజా రవీంద్ర, రఘుబాబు, ముకుల్ దేవ్ వంటి వెల్ నోటెడ్ పర్సనాలిటీలు యాక్ట్ చేశారు. ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఇందులో పాటలు సూపర్ డూపర్ హిట్ అందుకున్నాయి.

‘చంద్ర కళ, చంద్రకళ, శంభో శివ శంభో, అస్సలామ వాలేఖుమ్.. అప్సర నిన్నుచూస్తే హార్ట్ బీటే, పిల్ల నావల్ల కాదు.. నేను తట్టుకోలేను ఇంత అందాన్ని, నా కళ్లల్లోనే చూపులు నీతోనే’ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఇందులో కామెడీ ట్రాక్‌కు సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. చాలా మందికి అదుర్స్ అనగానే బట్టు, చారీ మధ్య ఫన్నీ సీన్లే గుర్తుకు వస్తుంటాయి. గురువుగారు, గురువుగారు అంటూ బ్రహ్మానందం చుట్టూ తిరుగుతూ కౌంటర్లు వేసే చారీ పాత్రలో తారక్ కితకితలు పుట్టించాడు. ఇక విలన్ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా అమాయకుడైన పాత్రలో నటించి మెప్పించాడు. ‘తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా’ డైలాగ్స్ మర్చిపోగలమా. ఇక ఇందులో తారక్ ఢీ కొనే విలన్ రోల్ చేసిన నటుడు ఎవరో తెలుసా..? ఆయన బ్యాగ్రౌండ్ ఏంటంటే..? ఆయన పేరు మహేష్ మంజ్రేకర్.

Sai manjrekar

ముంబయిలో పుట్టి పెరిగిన మంజ్రేకర్.. బాలీవుడ్ చిత్రాలతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో ఓ మూవీ చేసి హిందీలో కంటిన్యూ అయ్యాడు. 2007లో గోపీచంద్ హీరోగా వచ్చిన ఒక్కడున్నాడు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఈ స్టైలిష్ విలన్. ఆ తర్వాత హిందీ, ఇంగ్లీష్ చేస్తూనే తెలుగులోనూ కంటిన్యూ అయయాడు. హోమం తర్వాత ఆయనకు గుర్తింపునిచ్చింది అదుర్స్. ఇందులో కామెడీ విలన్‌గా కూడా మెప్పించాడు. దీని తర్వాత డాన్ శీను, ఐదేళ్ల పాటు తెలుగు తెరకు దూరమయ్యాడు. అఖిల్ మూవీతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. గుంటూర్ టాకీస్, వినయ విధేయ రామ, సాహో, కథ కంచికి మనం ఇంటికి, సర్కారు వారిపాటలో నటించాడు. హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో చేస్తూ టాలీవుడ్ పిలవగానే ఇక్కడ వాలిపోతున్నాడు. ఈ రెండేళ్ల కాలంలో ఆయన తెలుగు తెరపై కనిపించలేదు. కానీ బాలీవుడ్ స్టార్ విలన్లలో ఆయన ఒకరు. ఆయన భార్య, కూతురు కూడా నటే. డాటర్ సాయి మంజ్రేకర్ తెలుగులో రెండు చిత్రాలు చేసింది. ఘని, మేజర్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాల్లో చేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by FRIDAY FILMWORKS (@fridayfilmworks)