భారతీయ జనతా పార్టీలో పూర్వం నుంచి ఉన్న వారికంటే నిన్నా మెన్నా చేరిన ఆ ఎంపీలదే మొన్నటిదాకా హవా. మా మాటే.. బీజేపీ మాట, కేంద్ర ప్రభుత్వం మాట అన్నట్లుగా ఓ రేంజ్లో మాట్లాడేవారు. ప్రధాని, కేంద్రమంత్రులతో భేటీలు వేస్తూ హల్చల్ చేశారు. పార్టీ సమావేశాల్లోనూ అగ్రతాంబూలం వారిదే. అయితే ఏమైందో ఉన్నట్లుండి వారికి పార్టీలో ప్రాధాన్యత తగ్గినట్లు కనిపిస్తోంది. ఆ నాయకులెవరో కాదు.. టీడీపీ ప్లస్ బీజేపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, […]
అమరావతి రాజధాని, శాసన మండలి రద్దు వ్యవహారాల్లో తమకు కొరగాని కొయ్యలా తయారైన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరశింహారావును ఇటీవల టీడీపీ టార్గెట్ చేసింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటనలకు భిన్నంగా కేంద్ర వైఖరిని జీవీఎల్ వెల్లడిస్తూ.. టీడీపీ నేతలను ఇరకాటంలో పడేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జీవీఎల్కు వైఎస్సార్సీపీతో లోపాయికారి ఒప్పదం ఉందని, వైఎస్సార్సీపీ ఏజెంట్గా ఉన్నారని…ఇలా టీడీపీ నేతలు అనేక ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై జీవీఎల్ టీడీపీ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. […]
నిన్న లోక్ సభలో జరిగిన చర్చలో రాష్ట్ర రాజధాని అంశంపై తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి సమాధానమిస్తూ రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమని, రాష్ట్ర సరిహద్దుల పరిధిలో ఎక్కడైనా రాజదాని ఏర్పాటు చేసుకొనే స్వేచ్చ ఆయా రాష్ట్రప్రభుత్వాలకుందని స్ఫష్టం చేశారు. అమరావతిని కేంద్రం నోటిఫై చేసినట్టుగా కేంద్రమంత్రి ప్రకటించినట్టు మీడియాలో వార్తలొచ్చాయి. దింతో నిన్న మధ్యాహ్నం నుండి తెలుగుదేశంతో పాటు, ఆ పార్టీ అనుకూల మీడియాలో అమరావతిని కేంద్ర […]
అమరావతి లో భూములిచ్చిన రైతులకు సంఘీభావంగా ఫిబ్రవరి 2 న ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్న సీతానగరం లాకుల నుంచి బందరు రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా తలపెట్టిన లాంగ్ మార్చ్ కార్యక్రమం వాయిదా పడింది. అయితే ఈ లాంగ్ మార్చ్ నిర్వహించబోయే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఇరు పార్టీలు ప్రకటించాయి. రాజధాని కోసం భూములను త్యాగం చేసిన అమరావతి ప్రాంత గ్రామాల రైతుల కోసం ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 2 […]
ఏపీ బీజేపీ వ్యవహారాలు ముదురుతున్నాయి. ముఖ్య నేతల మధ్య విబేధాలు అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి. రాజకీయంగా బలపడాలని ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తున్న దశలోనే సొంత పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో బీజేపీ తీవ్రంగా సతమతం అవుతోంది. ముఖ్యంగా ఏపీ బీజేపీలో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య వైరం పెరుగుతోంది. కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలతో కలిసి సుజనా చౌదరి వంటి వారు వేస్తున్న స్కెచ్ తో ఎంపీ జీవీఎల్ నరసింహరావుకి […]
రాష్ట్రంలో జనసేన బిజెపి పార్టీలు 2024 ఎన్నికల వరకు కలసి పని చెయ్యాలని ఇరు పార్టీలు ఒక అవగాహనకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు పార్టీల సంయుక్త కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జనసేన బిజెపి కో ఆర్డినేషన్ భేటీ లో పాల్గొనడానికి నిన్న ఢిల్లీ కి జనసేన అధినేత పవన్ వచ్చారు. పవన్ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఆ పార్టీ ఎపి కో-ఇంచార్జ్ సునీల్ దేవధార్ తో కలసి […]
అధికార పక్షం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బిల్లుతో రాజధాని వికేంద్రీకరణ జరుగుతుందనే విషయంపై స్పష్టత వచ్చింది. ఈ సందర్భంగా కొంతమంది రాష్ట్రంలోని బీజేపీ వాదులు , జనసేన నేత పవన్ కళ్యాణ్ అమరావతిని చీల్చి రాష్ట్రానికి మూడు రాజధానులు తీసుకువస్తే కేంద్రం చూస్తు ఊరుకోదని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఏకంగా డిల్లీకి వెళ్ళి నేను కేంద్రంతో మాట్లాడి అమరావతే రాజధానిగా ఉండేలా చేస్తానని చెప్పుకొచ్చారు. రాజధాని విషయంలో జనసేనలో, బీజేపీలో మొదటి నుండీ భిన్న స్వరాలు […]
బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టినవే సీఎం వైఎస్ జగన్ చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరశింహారావు అన్నారు. హైకోర్టును రాయలసీమలో పెట్టాలని తాము డిమాండ్ చేసిన మేరకే వైఎస్సార్సీపీ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు. ఆ క్రెడిట్ తమ పార్టీకే ఎక్కువ రావాలన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే… ‘‘రాజధాని రాష్ట్రం పరిధిలోని అంశం. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఏర్పాటు పై కేంద్రం నియమించిన శివరామకృష్ణ కమిటీ విజయవాడ, […]
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలకు ముందు ‘పొత్తు’ పొడిచింది. కలసి సాగడం ఖరాయిన నేపథ్యంలో ఏ విధంగా సాగాలన్న అంశంపై బిజెపి, జనసేన పార్టీల నేతలు ఈ రోజు ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో చర్చించాల్సిన విషయాలపై కొందరు బీజేపీ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. వచ్చే నాలుగేళ్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తామన్నారు. అమరావతి, స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే తమ అజెండా కాదన్నారు. రాష్ట్రంలో […]