Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలకు ముందు ‘పొత్తు’ పొడిచింది. కలసి సాగడం ఖరాయిన నేపథ్యంలో ఏ విధంగా సాగాలన్న అంశంపై బిజెపి, జనసేన పార్టీల నేతలు ఈ రోజు ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో చర్చించాల్సిన విషయాలపై కొందరు బీజేపీ నేతలు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. వచ్చే నాలుగేళ్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తామన్నారు. అమరావతి, స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే తమ అజెండా కాదన్నారు. రాష్ట్రంలో అనేక పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్టు తెలిపారు. 2024 ఎన్నికల వరకు రెండు పార్టీలు కలిసి వెళ్లడంపై చర్చిస్తామని జీవీఎల్ తెలిపారు. ఏడు నెలల క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసిన పార్టీలు ఇప్పుడు పొత్తు పెట్టుకోవడం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సరికొత్త అధ్యాయానికి తెర తీసినట్లైంది.