అంతరిక్ష పరిశోధన, రక్షణ రంగాల్లో భారత్కు ఎనలేని విజయాలు చేకూరుస్తున్న ఇస్రో, డీఆర్డీవోలు.. ఇప్పుడు కరోనాపై కూడా దేశాన్ని గెలిపించడానికి నడుం బిగించాయి. కొన్ని రోజుల పాటు రాకెట్ల పరిశోధనలను పక్కనపెట్టి కరోనాపై దేశం చేస్తున్న పోరాటానికి సహాయం అందించడానికి ఇస్రో సిద్ధపడింది. ప్రస్తుతం ఆస్పత్రులను వేధిస్తున్న వెంటిలేటర్ల కొరతను తీర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. çకరెంటు లేకపోయినా సులభంగా ఆపరేట్ చేసేలా వెంటిటేటర్లను తయారు చేయడానికి సహకారం అందించనుంది. కేరళలోని తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ […]