iDreamPost

DRDO Recruitment: రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు! నెలకు రూ.40 వేల జీతం..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే జాబ్ నోటిఫికేషన్ల కోసం ఎంతో మంది యువత వెయ్యికళ్లతో ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా డీఆర్డీవో సంస్థ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే జాబ్ నోటిఫికేషన్ల కోసం ఎంతో మంది యువత వెయ్యికళ్లతో ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా డీఆర్డీవో సంస్థ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

DRDO Recruitment: రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు! నెలకు రూ.40 వేల జీతం..

ప్రస్తుత సమాజంలో ఉద్యోగం దొరకడం గగనంగా మారింది. ప్రతి ఏటా డిగ్రీలు పాస్ అయ్యి బయటకు వచ్చే యువత లక్షల్లో ఉంటే..ఉద్యోగాలు మాత్రం  వేల సంఖ్యలో మాత్రమే ఉంటున్నాయి. దాంతో చాలా మందికి జాబ్ దొరకడం లేదు.  ఇదే సమయంలో చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. కారణం..ఉద్యోగ భద్రత, సమాజంలో లభించే గౌరవ, మర్యాదలు లభిస్తాయని భావన. అందుకు ఏళ్ల తరబడి శ్రమిస్తూ.. నిద్రాహారాలు మాని మరి.. పరీక్షల కోసం ప్రిపేరవుతుంటారు. ఈ క్రమంలోనే రాత పరీక్షలు లేకుండా కూడా పలు జాబ్ నోటిఫికేషన్లు విడులవుతున్నాయి. తాజాగా నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్..రాత పరీక్ష లేకుండా ఏకంగా 40 వేలు సంపాదించే అవకాశం దొరికింది. మరి.. ఆ పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే జాబ్ నోటిఫికేషన్ల కోసం ఎంతో మంది యువత వెయ్యికళ్లతో ఎదురు చూస్తుంటారు. కొందరు బ్యాంక్ ఉద్యోగాల వైపుకు వెళ్తుంటే, మరికొందరు మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా పలు రకాల జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తుంటాయి. తాజాగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వలో ప్రధాన సంస్థల్లో ఒకటైనా డిఫెన్స్ రీసెర్స్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో)లో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలకు భర్తీకి ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇక ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్, సాలరీ, ఎగ్జామ్స్ విధానం వంటి పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము.

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ రక్షణకు సంబంధించిన కీలక రంగాల్లో డీఆర్డీవో ఒకటి.  దేశ రక్షణకు సంబంధించిన విషయాల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇక తరచూ డీఆర్డీవో నుంచి వివిధ రకాల నోటిఫికేషన్లు విడుదలవుతుంటాయి. తాజాగా కూడా డీఆర్డీవో లో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఒక భారీ గుడ్ న్యూస్ వచ్చింది. ఇటీవలే డీఆర్టీవోలోని జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

దరఖాస్తు విధానం:

డీఆర్డీవో విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ లో విడుదలైన పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకనే వారు అధికారిక వెబ్ సైట్ drdo.gov.in ద్వారా  చేసుకోవచ్చు. అందులోకి వెళ్లి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఇక డీఆర్టీవో విడుదల చేసిన ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనుంది. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 19  చివరి తేదీగా ఉంది. ఈ తేదీలోపు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హతలు:

డీఆర్డీవో విడుదల చేసిన ఈ నోటిఫికేషన్లో పోస్టులకు కొన్ని అర్హతలను నిర్ణయించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించాలి. అలానే కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో ఎంఈ లేదా ఎంటెక్ కలిగి ఉండాలి.

వయోపరిమితి:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి గరిష్ట వయోపరిమితి 28 ఏళ్లు మాత్రమే ఉండాలి. అలానే ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు మరో ఐదేళ్లు సడలింపు ఉంటుంది. అలానే ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. ఇక జీతం విషయానికి వస్తే.. డీఆర్డీవోలో ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెల జీతం రూ.37 వేల తో పాటు హెచ్ఆర్ఏ అదనంగా చెల్లిస్తారు. అలా మొత్తం రూ.40 వేలకు వస్తుందని తెలుస్తోంది.

ఉద్యోగ ఎంపిక విధానం:

ఈ పోస్టులకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. జూన్19, 20 తేదీల్లో ఈ ఇంటర్వూలు జరగనున్నాయి.  ఈ రెండు రోజుల  ఉదయం 8:30 గంటల నుంచి 10:00 గంటల మధ్య రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి